calender_icon.png 8 January, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పు చేయనప్పుడు భయమెందుకు..

08-01-2025 01:39:57 AM

ఎంపీ కిరణ్‌కుమార్ రెడ్డి

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి) :  ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తప్పు చేయనప్పుడు.. కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కు మార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఏ తప్పు చేయనప్పుడు విచారణ ఎదుర్కోవాలని,  తప్పు చేయలేదని నిరూపించుకోవాలని మంగళవారం ఆయన ట్వీ ట్ చేశారు. కేటీఆర్‌వి చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చిల్లర పనులా..? అంటూ మండిపడ్డారు. తప్పు చేయనప్పుడు డొంకతిరుగుడు మాటలు, వితండవాద ప్రేలాపనలు, వింత విన్యాసాలు ఎందుకని నిలదీశా రు. కేటీఆర్ మాటల్లో డొల్లతనం చూస్తుంటే.. తప్పు చేసినట్లుగా తెలుస్తోందన్నారు.