calender_icon.png 3 April, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎందుకు ఉలికిపడుతున్నారు

27-03-2025 01:34:21 AM

కరీంనగర్ క్రైమ్, మార్చి26 (విజయక్రాంతి): చరిత్ర తెలిసిన వాళ్లకు కేసీఆర్ అసలు బాగోతం ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని , కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చరిత్రలో ఉన్నవే, మాట్లాడుకున్నవే నని ,  బిఆర్‌ఎస్ నేతలు వాళ్ల జాతిపిత , ఉద్యమ నేత  కెసిఆర్ గురించి వాస్తవాలు తెలియకపోతే తెలుసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు  రమేష్  అన్నారు.

బుధవారం  బిజెపి జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్    ఇటీవల కెసిఆర్ గురించి చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది..? కెసిఆర్ చరిత్ర గురించి చెబితే బి నేతలు ఉలికి పడుతున్నారని, వాస్తవాలను జీర్ణించుకోలేక అవాకులు చేవాకులు పేలుతున్నారని ఘాటుగా విమర్శించారు. 

కేసీఆర్ అసలు చరిత్ర లో  దొంగ నోట్ల అంశంలో,  కేంద్రమంత్రిగా పని చేసినప్పుడు సహారా స్కాం ఈఎస్‌ఐ స్కాం లలో ఆయన పేరు ప్రధానంగా వినిపించిందని, పత్రికల్లో కథనాలు వచ్చాయని,  ఈచరిత్ర  గురించి కరీంనగర్ బిఆర్‌ఎస్ నేతలకు తెలియకపోతే తెలుసుకుంటే మంచిదన్నారు. అసలు కరీంనగర్ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కి కనీస రాజకీయ పరిజ్ఞానం లేదని ఆయన ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చల్ల హరి శంకర్  ప్రజా క్షేత్రంలో నుంచి వచ్చిన నాయకుడు కాదని, ఆయన ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన చరిత్ర లేదని, ఆయన ఓ నామినేటెడ్ పొలిటిషన్ అన్నారు. అలాంటి వ్యక్తి ప్రజల మన్ననలతో, ఆశీస్సులతో  కరీంనగర్ పార్లమెంటు నుండి రెండుసార్లు గెలుపొంది కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ కుమార్ గురించి మాట్లాడే అర్హత స్థాయి ఉందా అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.

బిఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు హరి శంకర్ పరిధికిమించిమాట్లాడుతున్నారని , ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు , మాజీ ఎంపీపీ వాసాల రమేష్, తాజా మాజీ కార్పొరేటర్ కాసర్ల ఆనంద్, వంగల పవన్, బండ రమణారెడ్డి , నరహరి లక్ష్మారెడ్డి కరీంనగర్ జోన్ అధ్యక్షులు  బండారి గాయత్రీ దేవి, శ్రీనివాస్ , తణుకు సాయి , ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.