calender_icon.png 21 March, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్బాయిలపైనే చర్యలెందుకు?

06-07-2024 12:32:55 AM

డెహ్రాడూన్, జూలై 5: టీనేజర్ల డేటింగ్ విషయంలో వివక్షపూరిత పద్ధతులను వ్యతిరేకిస్తూ ఉత్తరాఖండ్ హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మైనర్ అబ్బాయిలను మాత్రమే అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించింది. వాళ్లను నిర్బ ంధంలోకి తీసుకోవడానికి బదులుగా కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించింది. న్యాయవాది మనీశా దాఖలు చేసిన పిల్‌పై ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ రితు బహ్రీ, జస్టిస్ రాకేశ్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. లింగ వివక్ష ఎం దుకని పిటిషనర్ ప్రశ్నించారు. పరస్పర అంగీకారంతో జరిగే ఇలాంటి కేసుల్లో బాలికలనే బాధితులుగా చూ డటం ఎంతవరకూ సమంజసమని అడిగారు. వివరణ ఇవ్వాలంటూ కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు కోరింది.