- నేడు, రేపు ఐపీఎల్ మెగావేలం
- పంత్, రాహుల్, శ్రేయస్‌పై కన్ను
జెద్దా (సౌదీ అరేబియా): ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ మెగావేలంలో జాక్‌పాట్ ఎవరికి తగలనుంద నేది నేటితో తేలిపోనుంది. సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నేడు, రేపు ఐపీఎల్ మెగావేలం జరగనుంది. మెగా వేలంలో 204 స్లాట్స్ కోసం 10 ఫ్రాంచైజీలు 641.5 కోట్లు ఖర్చు చేయ నున్నాయి.
వేలం బరిలో 1574 మంది క్రికెటర్లు ఉండగా.. ఇందు లో 1165 మంది భారత క్రికెటర్లు ఉండగా.. మిగిలిన 409 మంది విదేశీ ఆటగా ళ్లు ఉన్నారు. రిటైన్‌లో ఇద్దరిని మాత్రమే అట్టిపెట్టు కున్న పంజాబ్ వద్ద అత్యధికంగా రూ. 110.5 కోట్లు ఉండగా.. అత్యల్పంగా రాజస్థాన్ రూ. 41 కోట్లు ఖర్చు చేయ నుంది.
ఈ వేలంలో అందరి కళ్లు రిషబ్ పంత్, కేఎల్ రాహు ల్, శ్రేయస్ అయ్యర్‌లపైనే ఉన్నాయి. వీళ్లతో పాటు అర్ష్‌దీప్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, ఆవేశ్ ఖాన్, హర్షల్, భువనేశ్వర్, బట్లర్, లివింగ్‌స్టోన్, రబాడలకు కూడా మంచి ధర దక్కే అవకాశ ముంది. వేలంలో ఉన్న ఆటగాళ్లలో 81 మంది తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించారు.