calender_icon.png 23 October, 2024 | 3:47 AM

16 నెలల గరిష్ఠానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం

16-07-2024 01:06:53 AM

న్యూఢిల్లీ: దేశంలో టోకు ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠానికి చేరింది. ఈ ఏడాది జూన్ నాటికి టోకు ద్రవ్యోల్బణం 3.36 శాతానికి చేరుకుంది. అంతకు ముందు నెల మేలో ఇది 2.61 శాతంగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం 1.26 శాతంగా నమోదయింది. ఆహార పదార్థాలు ముఖ్యంగా కూరగాయలు, తయారీ వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో టోకు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కాణమయింది.

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారంగా జూన్‌లో ద్రవ్యోల్బణం 3.36 శాతంగా ఉందని, ఈ నెలలో ధరలతో ద్రవ్యోల్బణం కూడా పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.ఆహార పదార్థాలు, ఆహార ఉత్పత్తి, ముడి చమురు, పెట్రోలు, సహజవాయువు, ఇతర వస్తువుల ధరల పెరుగుదలతో పదార్థాల ద్రవ్యోల్బణం జూన్‌లో 10.87 శాతం పెరగ్గా, మేలో 9.82 శాతంగా ఉంది.  కూరగాయల ద్రవ్యోల్బణం జూన్‌లో 10.87 శాతంగా ఉండగా, మే నెలలో 32.42 శాతంగా నమోదయింది.

ఉల్లి ద్రవ్యోల్బణం 93.35 శాతం కాగా పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం జూన్‌లో 21.64 శాతంగా ఉంది జూన్‌లో వినియోగదారుల ధరల సూచీ( సీపీఐ)లో కూడా పెరుగుదల నమోదయింది. నాలుగు నెలల్లో గరిష్ఠ స్థాయి 5.08 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరల పెరుగుల ఈ సూచీపై కూడా ప్రభావం చూపించిందని భావిస్తున్నారు.