calender_icon.png 2 April, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజాన్ మాసంలాగానే ఏడాది మొత్తం నిష్టగా ఉండాలి

01-04-2025 02:22:00 AM

నాగర్ కర్నూల్ మార్చి 31 ( విజయక్రాంతి ) పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంత నిష్టగా ఉన్నారో మిగతా 11 మాసాలు కూడా అంతే నిష్టగా మెలగాలని జామియా నిజామీయా ఆలిమ్ హాఫీజ్ షాకీర్ సిద్దిఖీ అన్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రసంగించారు. కుల మత వర్గ భేదాలనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరితో స్నేహభావంతో మెలగాలని ఇదే ప్రవక్త చెప్పిన సూక్తి అని పేర్కొన్నారు. మనిషి సంపాదించిన దాంట్లో కొంత పేదలకు కూడా సహృదయంతో పంచి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు శశిధర్ రెడ్డి, బీఎస్పీ నాయకులు కొత్తపల్లి కుమార్ లు పాల్గొని ముస్లింలను ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.