నేడు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్
దుబాయ్: ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. నేడు జరగనున్న ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇద్దరిలో ఎవరు గెలిచినా వారికిదే తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్ కానుంది. గతంలో న్యూజిలాండ్ (2009, 2010)లో రెండుసార్లు ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్‌కే పరిమితం కాగా..
సౌతాఫ్రికా గతేడాది సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇరుజట్ల బలబలాలు సమానంగా ఉన్నప్పటికీ సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టిన కివీస్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
వీరితో పాటు సీనియర్లు కాప్, అన్నెకె బోస్క్‌లు కీలకం కానున్నారు. బౌలింగ్‌లో లాబా (10 వికెట్లు) మంచి ఫామ్‌లో ఉంది. ఇక ఫైనల్ మ్యాచ్‌కు నిమాలి పెరీరా, క్లేరీ పొలోసాక్ ఫీల్డ్ అంపైర్లు వ్యవహరిస్తుండగా..థర్డ్ అంపైర్‌గా అన్నా హారిస్, జాక్విన్ విలియమ్స్ ఫోర్త్ అంపైర్‌గా విధులు నిర్వర్తించనున్నారు.