calender_icon.png 23 December, 2024 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల సమీకరణాల కుస్తీలో గెలుపెవరిది?

21-09-2024 12:00:00 AM

ఐ.వి.మురళీకృష్ణ శర్మ :

హర్యానా అసెంబ్లీ ఎన్నికల చిత్రం

ఆటల పోటీల్లో ముఖ్యంగా కుస్తీలో పతకాలపంటను పండించే హ ర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా రసవత్తరంగా సాగుతున్నాయి. 90 స్థానాలున్న రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్ 46 సీట్ల ను సాధించడానికి రాజకీయ పార్టీలు ఎ త్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. జాతీయ పా ర్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉన్న ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక తతో పాటు కుల సమీకరణాలు కూడా కీ లకంగా మారుతున్నాయి. పీపుల్స్ పల్స్ రీ సెర్చ్ సంస్థ ఇటీవల రాష్ట్రంలో నిర్వహించి న ట్రాకర్ పోల్ సర్వేలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర వ్య తిరేకత ఉండడంతో, అది కాంగ్రెస్‌కు అనుకూలంగా మారనున్నట్లు స్పష్టం గా కనిప్తి న్నది. ప్రభుత్వ వ్యతిరేకతను కుల సమీకరణాలతో ఎదుర్కోవాలని బీజేపీ ప్రయత్ని స్తుంటే, అవే కుల సమీకరణాల సూత్రం తో పదేళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ కృషి చేస్తుండడంతో హర్యానా ఎన్నికలు కులాల చుట్టూ తిరుగుతున్నాయి.

కులసమీకరణాలదే కీలక పాత్ర

రాష్ట్రం ఆవిర్భావం నాటి నుండి కుల సమీకరణాలు హర్యానాలో కీలక పాత్రను పోషిస్తున్నాయి.  ప్రస్తుత ఎన్నికల్లో జాట్ ఓట్లతో పాటు ఎస్సీ సామాజిక ఓట్లను కూడా పొంది గెలవాలని కాంగ్రెస్ చూ స్తుంటే, ఈ సమీకరణాలకు పోటీగా ఓబీసీలతో పాటు అగ్రవర్ణాల సామాజిక ఓట్ల ను పొంది గట్టెక్కాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. రైతుల వ్యతిరేకత, అగ్నివీర్ పథకంపై యువత ఆగ్రహం, రెజ్లింగ్ క్రీడాకారుల ని రసనలు, ధరల పెరుగుదలతో మహిళల్లో అసంతృప్తి అంశాలతో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది.

లాడో లక్ష్మీ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2100, బాలికలకు స్కూటీ, రెండు లక్ష ల ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు నిరుద్యోగ భృతి, ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలు వంటి ప్రజాకర్షణ పథకాలతో ప్రభుత్వ వ్య తిరేకత లేకుండా చేయాలని బీజేపీ భావిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆ పార్టీకి అనుకూలంగా లేవు. దీనికి తోడు జాట్లు, ఎస్సీ ఓటర్లు కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉండడంతో బీజేపీ జాట్లేతర ఓట్లను సమిష్టిగా పొందేందుకు ప్రణాళికలు రూపొంది స్తున్నది. ఎన్నికలు జాట్లు, జాట్లేతర మధ్య ఉండేలా చూసి లబ్ధి పొందాలని బీజేపీ ప్ర యత్నాలు సఫలం కావడం సులభం కాద ని లోక్‌సభ ఫలితాలతో స్పష్టమైంది.

పార్లమెంట్ ఎన్నికల ముందు మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ఓబీసీకి చెందిన నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసినా సత్ఫలితాలు రా లేదు. జాట్లతో పాటు ఎస్సీలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడంతో  రాష్ట్రంలోని పది ఎంపీ స్థానాల్లో రెండు పార్టీలు చెరో ఐదు స్థానాలు సాధించాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్లీ ఇదే తరహా ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.హర్యానాలో 27 శాతం ఉన్న జా ట్లు మూడు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. ప్రముఖ జాట్ నేతలు బన్సీలాల్, దేవీలాల్, ఓం ప్రకాశ్ చౌతాల, భూపీందర్ సింగ్ హూడా  జాతీయ, రాష్ట్ర స్థాయిలో కీలక పదవులను చేపట్టారు.

జా ట్లు 2014 లోక్‌సభ ఎన్నికల వరకు కాంగ్రె స్ వెంటే ఉన్నా, తర్వాత దేశ రాజకీయాల్లో ఏర్పడిన పరిణామాలతో రాష్ట్రంలో కూడా మార్పులు సంభవించాయి. ప్రాంతీయ పార్టీలైన జేపీపీ, లోక్‌దళ్, ఐఎన్‌ఎల్‌డీతో పాటు కాంగ్రెస్ పార్టీలో జాట్ నేతల ఆధిపత్యం కనిపిస్తున్న.  దీనికి అదనంగా రాష్ట్రంలో 21 శాతం ఉన్న ఎస్సీ ఓట్లపై కూడా కాంగ్రెస్ కన్నేసింది. ప్రధానంగా ఎస్సీల్లో అధికంగా ఉండే చమర్ సామాజిక వర్గాన్ని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.

మోదీ హవాతో అధికారంలోకి బీజేపీ

జాతీయ రాజకీయాల్లో మోదీ ప్రవేశం తో 2014 పార్లమెంట్ ఎన్నికల్లో హర్యానా రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. 2009లో ఒక్క సీటు గెలవని బీజే పీ 2014లో ఏడు స్థానాలు పొందింది.  బ్రాహ్మణులు, బనియాలు, పంజాబీ ఖత్రీ లు, అరోరాలు వంటి అగ్ర వర్ణాలతో పా టు ఓబీసీలోని ఆహిర్, యాదవ్, గుర్జర్, సైనీ వంటి సామాజిక వర్గాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టడంతో రాష్ట్రంలో  కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వడం ప్రారంభించింది. ఈ పరిణామాలతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు మాత్రమే గెలిచిన బీజేపీ  ఎవరూ ఊహించని విధంగా 2014లో 47 సీట్లతో అధికారంలోకి వ చ్చింది. దీంతో రాష్ట్రంలో జాట్లు, జాట్లేతర రాజకీయాలకు నాంది పలికినట్టయ్యింది.

పంజాబీకి చెందిన మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా, అహిర్, యాదవ్ వర్గాలకు చెందిన  పలువురు నేతలు కీలక పదవులు చేపట్టారు.జాట్లేతర ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి 2016లో జాట్ల రిజర్వేషన్ల ఉద్యమం ఇబ్బందికర పరిస్థితులు తెచ్చింది. దీంతో 2019లో బీజేపీ 40 స్థానాలకే పరిమితం కావడంతో హర్యానాలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.  ప్రస్తుతం జాట్ల ఓట్లకు వ్యతిరేకంగా ఓబీసీ ఓట్లను ఏకపక్షంగా పొందాలని చూస్తున్న బీజేపీ 5 శాతం ఉన్న సైనీ సామాజిక వర్గానికి చెందిన నయాబ్ సింగ్ సైనీ నేతృత్వం లో ఎన్నికలకు సిద్ధమైంది.

మరోవైపు బ్రా హ్మణ సామాజిక వర్గానికి చెందిన మోహన్‌లాల్ బదోలికి పార్టీ పగ్గాలు అప్పగించిం ది. టికెట్ల కేటాయింపులో జాట్లకు బీజేపీ 15 టికెట్లు (17శాతం)కేటాయించగా, కాం గ్రెస్ 28 స్థానాలు (31శాతం)ఇచ్చింది. వ్య వసాయ రంగంలో జాట్లు అధికంగా ఉం డడంతో, రైతు వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ ఈ సామాజిక వర్గానికి తక్కువ టికె ట్లు ఇచ్చింది. జాట్ల సామాజిక వర్గం ప్రభావమున్న ప్రాంతీయ పార్టీలు జేజేపీ, ఐఎన్‌ఎల్‌డీ క్రమంగా బలహీనపడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ జాట్ల ఓట్లపై మరిం త ఆశలు పెంచుకుంది. బీజేపీపై జాట్లు అ ధికంగా ఉండే  రైతుల ఆగ్రహం కాంగ్రెస్ కు కలిసి వస్తుంది. 65 శాతం  రైతులు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు పీపు ల్స్ పల్స్ ట్రాక్ పోల్ సర్వేలో వెల్లడైంది.

జాట్లేతర ఓట్లపై దృష్టి పెట్టిన బీజేపీ టి కెట్ల కేటాయింపులో అగ్రవర్ణాలకు, ఓబీసీలకు ప్రాధాన్యతిచ్చింది. ఇందుకు ఉదాహ రణగా గోహన సెగ్మెంట్‌ను చెప్పుకోవచ్చు. ఇక్కడ 30 శాతం జాట్లు ఉండడంతో గ తంలో అన్ని పార్టీలు వారికే టికెట్ ఇచ్చేవి. ఇప్పుడు బీజేపీ జాట్లకు బదులుగా బ్రా హ్మణ సామాజిక వర్గానికి చెందిన అరవిం ద్ కుమార్ శర్మకు టికెట్ ఇచ్చింది. జాట్లేతర ఓట్లపై దృష్టి పెట్టిన బీజేపీ బ్రాహ్మణు లకు, పంజాబీ ఖాత్రీలకు చెరో 11 స్థానాలు ఇచ్చింది.

మరోవైపు కాంగ్రెస్ బ్రాహ్మణులకు 5, పంజాబీ ఖాత్రిలకు 6 టికెట్లు ఇ చ్చింది. రాష్ట్రంలో 40 శాతం ఉన్న ఓబీసీ ల ఓట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సీఎం సైనీని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని లాద్వా అసెంబ్లీ సెగ్మెంట్ నుం డి బరిలోకి దింపింది. దీంతో ఓబీసీలు అధికంగా ఉండే కురుక్షేత్ర, అంబాల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మేలు జరుగుతుందని పార్టీ భావిస్తున్నది. రెండు పార్టీలు కూడా తమకు మద్దతుగా ఉంటాయనుకుంటున్న ఆయా సామాజిక వర్గాల ఓట్లను ఏకీకృత చేయడంపైనే దృష్టి సారించాయి.

రాష్ట్రంలో ఓబీసీ, అగ్రవర్ణాల సోషల్ ఇంజినీరింగ్‌తో పాటు సంక్షేమ పథకాలు ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బీజేపీని గట్టెక్కిస్తాయా అని అధ్యయనం చేయడానికి పీపుల్స్ పల్స్ సంస్థ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అంత సులభం కాదని తెలుస్తున్నది.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 35, బీజేపీ 23, ఐఎన్‌ఎల్‌డీ - బీఎస్పీహెచ్‌ఎల్పీ కూటమి 3, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిగిలిన 26 స్థానాల్లో పోటాపోటీ నెలకొంది.

గట్టిపోటీ ఉన్న ఈ 26 స్థానాల్లో చాలాచోట్ల కాంగ్రెస్‌కే కొంత మెరుగైన పరిస్థితి ఉంది.   హర్యానా ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని ట్రాక్‌పోల్ సర్వేలో ఓటర్లను ప్రశ్నించగా 39 శాతం మంది మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా వైపు మొగ్గు చూపగా, సిట్టింగ్ సీఎం నయాబ్ సింగ్ సైనీకి 28 శాతం మద్దతే లభించింది. ప్రస్తుత పరిస్థితుల్లో హర్యానాలో  వాతావరణం కాంగ్రెస్‌కు కొంత అనుకూలంగానే కనిపిస్తోంది. రెండు పార్టీల సోషల్ ఇంజినీరింగ్ ఎవరికి మేలు చేకూరుస్తుంది అనేది అక్టోబర్ 5న ప్రజలిచ్చే తీర్పు, 8న వెలువడే ఫలితాల్లో తేలనుంది.  

  వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ