- పట్టణంలోని ప్రధాన రోడ్ల ఫుట్‌పాత్‌లపై వ్యాపారం
- కొన్ని షాపుల ముందు ఫుట్‌పాత్‌లపై వ్యాపారం..
- రోడ్లపై వాహనాల పార్కింగ్
- ప్రమాదాలకు నిలయాలుగా పట్టణ ప్రధాన రోడ్లు
- ప్రమాదాల జరుగుతున్నా నివారణ చర్యలు శూన్యం
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి) : పాలమూరు ప్రధాన రోడ్ల పక్కన ఉన్న ఫుట్ పాతులను ఆక్రమణ చేసి.. మమ్మల్ని ఆపేది ఎవరు అనేలా కొందరు షాపుల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. ఫుట్ పాత్‌లపై వారికి కావలసిన వ్యాపారా న్ని ఉంచుతూ వ్యాపారమావధిగా వ్యాపా రం చేసుకుంటూ వాహన చోదకులకు ప్ర యాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫుట్ పాతులపై ఆ షాప్ లో నిర్వాహకులు వ్యాపారం చేయడంతో వాహనచోదకులు రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తూ రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తుండ్రు.
నిత్యం అధికారులు తిరుగు తున్న ఆదిశక నివారణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. వారం తిరగకముందే ప్రధాన రోడ్లపై కూడా ప్రమాదాలు జరు గుతూ ప్రాణాలు పోతున్న పట్టింపు లేనట్టు వ్యవహరించడంతో పట్టణవాసులు అసహ నం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనల మేరకు ఫుట్ పాతులను ఇలాంటి వ్యాపారం చేయ కుండా పాదాచారులకు, వాహన చోదకుల కు అవసరమైన విధంగా ఉపయోగించు కునేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు అధికారులు పర్యవేక్షణ చేసి ఫుట్ పాత్‌లపై వ్యాపారం చేస్తే వాటిని తొలగిం చి ప్రయాణికులకు పాదాచారులకు సహ కారం అందించవలసిన అవసరం అధికా రులపై ఎంతైనా ఉంది.
నో తై బజార్..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నందు చిరువ్యాపారుల నుంచి ఎలాంటి తై బజార్ రుసుము వసూలు చేయకూడదని నిబంధ నలను తీసుకువచ్చిన విషయం విదితమే. నో తైబజార్ విషయం చిరువ్యాపారుల నుంచి విశేష స్పందన లభించింది.
కాగా ఎక్కడపడితే అక్కడ ప్రధాన రోడ్లపై కొంద రు షాప్ల నిర్వాహకులు వారి వ్యాపార నిమిత్తం ఫుట్‌పాత్ లపై ఇతరులకు వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు, వారి వ్యాపా రాన్ని విస్త రించేందుకు సహకారం చేస్తుం డ్రు. ఈ విధానాలకు ముగింపు పలికితేనే ప్రధాన రోడ్లపై రాకపోకులకు ఇబ్బందులు తొలగి పోయే అవకాశం ఉంది.
పట్టణంలోనే ప్రమాదాలు..
పట్టణ ప్రాంతంలోని ప్రమాదాలు వరు సగా జరుగుతున్నాయి. ఇటీవల న్యూ టౌన్ లో ఇద్దరు మెడికల్ విద్యార్థులు, టీడీ గుట్ట దగ్గర ఓ వ్యక్తి దుర్మరణం కావడంతోపాటు పలువురు ప్రమాదాలలో చిక్కుకుంటు న్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఫుట్‌పాత్‌లపై ఇలాంటి వ్యాపారాలు చేయ కుండా ఖాళీగా ఉండే లా చూడవలసిన అవస రం ఎంతైనా ఉంది. దీంతో కొంతమేరకు వాహ నాల రాకపోకలకు ఇబ్బందులు తొలిగిపోయే అవకాశాలు ఉన్నాయని పట్టణవాసులు చెబుతున్నారు.
అందరికీ చెప్పాం.. తొలగిస్తాం..
ఫుట్‌పాత్‌లపై ఎవరు ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆక్రమణ... అస్సలు చేయకూడదని ఇప్పటికే వివిధ షాపుల నిర్వాహకులకు చెప్పడం జరిగింది. సమయం ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఫుట్ పాతులను ఆక్రమించి వ్యాపారం చేస్తే వాటిని తొలగించే ప్రక్రియను ముందు కు తీసుకుపోతాం.
మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మహబూబ్ నగర్