calender_icon.png 19 January, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరు చెపితే స్పందిస్తారు?

19-01-2025 12:00:00 AM

  1. పదేళ్లయినా సాకారం కాని పబ్లిక్ పార్కు
  2. ముఖ్యమంత్రి, కలెక్టర్ ఆదేశాలూ బేఖాతర్
  3. కోర్టు వివాదంలో ఉన్న భూమిలో సేద్యం
  4. మొద్దు నిద్రలో రెవెన్యూ శాఖ

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 18 (విజయక్రాంతి): కోర్టు ఆదేశాలు అమలు చేయరు, సీఎంవో కార్యాలయ లేఖనూ పట్టించుకోరు. కలెక్టర్ ఆదేశించినా పెడచెవిన పెడుతున్నారు. త  ఎవరూ ఏమీ చేయరనే ధీమాలో భ నారూద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ అధికారుల పని తీరు ఉన్నది. వారు స్పందించా  ఎవరి ఆదేశాలు రావాలో అని ప్రజ  చర్చించుకుంటున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని వెంగళరావు కాలనీలో ప్రజల సౌకర్యార్థం కేటాయించిన పబ్లిక్ పార్కు కల పదేయ్యినా సాకారం కాలేదు. కోర్టు పరిధిలో ఉన్న భూమిని ఓ వ్యక్తి కబ్జాచేశాడని ఆరోపణలున్నాయి. సర్వే చేసి ప్రభుత్వ భూమిని స్వాధీ  చేసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు జిల్లా కలెక్టర్..

మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీచేసినా పెడచెవిన పెట్టడం గమనార్హం. కలెక్ట  కూత వేటు దూరంలో గతంలో పనిచేసిన కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ హయాంలో ప్రభుత్వ భూమిగా 444/1 సర్వే నంబర్‌ను గుర్తించి హద్దులు పెట్టి ఈ స్థలంలో ఎవరైనా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

ఆ ఆదేశా  బేఖాతర్ చేస్తూ ప్రస్తుతం ఆ స్థలంలో నిర్మాణాలు వెలవడం, కొంత భూమిలో ఏకంగా వరిసాగు చేసే తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

రెవెన్యూ పనితీరు ఇదీ..

పాల్వంచ మండల పరిధిలోని భూములకు మున్సిపాలిటీలు నంబర్లు ఇచ్చి, అక్రమ నిర్మాణాలను ప్రొత్సహించినా పట్టించుకోలేదు. సర్వే నంబర్ 444లో పొంతన లేని నంబర్లతో పదుల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నా పట్టనట్టు వ్యవహరించారు. వెంగళరావు కాలనీలో సర్వే నంబ  727లో 5.20 ఎకరాల భూమి మరణించిన ఓ వ్యక్తి పేరుతో ఉంది.

2013-14లో నాటి తహసీల్దార్ ఆ భూమిని అక్రమంగా ఓ కబ్జాదారుడికి బదలాయించాడు. స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం వెలుగు చూసింది. ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు, పబ్లిక్ పార్కు నిర్మించాలని ఆ ప్రాంతానికి చెందిన హనుమాన్ యువజన సంఘం అధ్యక్షుడు ఆరుద్ర సత్యనా  2014లో కలెక్టర్‌కు విజ్ఞపి చేశారు. 

దాంతో వెంగళరావు కాలనీకి పబ్లిక్ పార్కు అంశం ప్రారంభమైంది. పదేళ్లయినా  నేటికి అది కార్యరూపం దాల్చలేదు. ఆరుద్ర సత్యనారాయణ ఇటీవల కలెక్టర్ జితేష్ వీ పాటిల్‌ను మరోసారి ఫిర్యాదు చేశారు.  

కోర్టుకు చేరిన వివాదం

సర్వే నంబర్ 727/3/అ పహానిలో గడ్డమనుగు చద్రశేఖర్‌రావు పేరుతో 5.20 ఎకరాలు భూమి ఉంది. ఆ భూమి నుంచి 2013-14లో సమ్మిడి వెంకటరెడ్డి అనే వక్తి పేరుపై 3.10 ఎకరాల భూమి 727/  గా అప్పటి పాల్వంచ తహసీల్దార్ రికార్డు చేశారు. ఆర్‌సీ నంబర్ బీ/1742/  2021 ఏప్రిల్ 8న పాల్వంచ అప్ప  తహసీల్దార్ ఆ భూమిపై విచారణ చేసి  క్రమంలో 2017లో పనిచేసిన గన్యా నా  భూమి బదలా  నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని గుర్తించారు.

అనంతరం సమ్మిడి జనార్దన్‌రెడ్డికి నోటీస్ జారీచేసి, ఆరు రోజుల్లో భూమి నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించినట్టు రెవె  డివిజన్ అధికారికి రిపోర్టు చేశారు. దీంతో సమ్మిడి జనార్దన్‌రెడ్డి  2017లో కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో 3.10 ఎకరాల భూవివాదం కోర్టు పరిధిలోకి చే  అప్పుడే రెవెన్యూ అధికారులు ఆ భూమిలో ఈ భూమి కోర్టు పరిధిలో ఉం  బోర్డు ఏర్పాటుచేశారు.

కబ్జాదారు ఆ బోర్డు తొలగించి ఆక్రమించాడు. 3.10 ఎకరాల భూమి కోర్టు పరిధిలో ఉంటే మి  2.10 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాల్సి ఉం  వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పబ్లిక్ పార్క్ స్థలం అంశంపై అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఫిర్యాదు చేయగా సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని సెప్టెంబర్ 2022లో సీఎంవో కార్యాలయం నుంచి అప్పటి కలెక్టర్ అనుదీప్‌కు లేఖలో ఆదేశాలు జారీచేశారు. నేటికి ఆదేశాలు అమలుకాలేదు.