21-03-2025 12:24:26 AM
మహబూబ్ నగర్ మార్చి 20 (విజయ క్రాంతి) : భూకబ్జాలు చేయాలంటే ప్రభుత భూములను, చెరువుల భూములను చేస్తే కేవలం అధికారులను మెయింటైన్ చేస్తే సరిపోతుందనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ప్రభుత్వ భూముల పైనే అత్యధికంగా కబ్జాదారులు కన్ను వేస్తున్నారని ఆరోపణలు ఊపొందుకుంటున్నాయి.
ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని నిత్యం ఎక్కడో ఒకచోట తెలుస్తూనే ఉంది. ప్రవేట్ భూముల జోలికి పోతే ఆ భూముల వ్యక్తులతో ఎన్నో ఇబ్బందులు అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ప్రభుత్వంలో అయితే చాలు అనే విధంగా కబ్జాదారులు తమ పంచ విసురుతున్నారు. ఈ తరుణంలోనే జడ్చర్ల పట్టణంలోని నడిబొడ్డున ఉన్న నల్లకుంట భూమి కబ్జా కోరల్లో కొట్టుమిట్టాడుతుందనే ఆరోపణలకు బలం చేకూరుతుంది.
ఎన్నికలు వచ్చిన సమయం అప్పుడు నేతలు ఎవరైనా కబ్జాదారులను, దౌర్జన్యాలను, అక్రమాలను తవ్విమని ప్రసంగాలు చేస్తున్న నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలను నిర్వీర్యం చేసేందుకు ఆలోచన కూడా చేయడం లేదంటే దీని వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రజలకు అంతు చిక్కడం లేదు. ఈ తరుణంలో జడ్చర్లలో నల్లకుంట భూమి దర్జాగా కొందరు కబ్జా చేస్తున్నారని కంటికి కనిపిస్తున్న అధికారులు మాత్రం అటువైపు చూడడం లేదని ఆరోపణలు బలంగా ఉన్నాయి.
-సమగ్రంగా విచారణ చేస్తే నల్లకుంటకు పూర్వ వైభవం
నల్లకుంట భూమికి సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేస్తే నల్లకుంట కు అపూర్వ వైభవం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే రికా ర్డులు పరిశీలనతో పాటు నల్లకుంట నీటి పరిపాక ప్రాంతంతో పాటు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ భూములు కూడా నల్లపూట సత్తం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నా యి. ఇలా ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ముందుకు సాగితే జడ్చర్ల పట్టణ నడిబొడ్డున ఎంతో హల్లదకరమైన నల్లకుంట ఆవిష్కృతం కానుంది.
-కబ్జాలకు,అక్రమాలకు తావిమన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
కేవలం ఎన్నికల సమయంలోనే కాదు ఎన్నికల ముగిసిన తర్వాత కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నియోజకవర్గంలో భూకబ్జాలకు అక్రమాలకు దౌర్జన్యాలకు తావివ్వమని బహిరంగానే పలుమార్లు బహిరంగ ప్రకటన చేసిన విషయం విధితమే.
ఇది విన్న జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు ఇక ఎక్కడ కూడా కబ్జాలు కావని ప్రజలు సంతోషమైన జీవితంలో గడిపేందుకు అవకాశం ఉంటుందని ఆశించారు. కాగా ప్రధానంగా జడ్చర్ల పట్టణవాసులకు ఎంతో ఆళ్ల దగ్గర వాతావరణాన్ని అందించిన నల్లకుంట చెరువు జాగ్రత్తగా తగ్గుముఖం పట్టడంతో పట్టణవాసులు నేటికీ చర్చ తీవ్రంగా ఉంది. నల్లకుంటను ఎట్టి పరిస్థితుల్లో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-కొంత భాగంలో అడ్డంపెట్టిన రేకులు...
నల్లకుంట చెరువు భూభాగంలో ఎందుకు రేకులు అడ్డం పెట్టారో తెలియదు కానీ కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకునేలా రేగులను అడ్డంపెట్టి మరోవైపు చెరువు చిన్నదిగా కనిపిస్తుంది. ఈ నల్లకుంట చెరువు భూభాగ విషయంలో ఇప్పటికే కోర్టు సైతం పలు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
కాగా అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో నల్లకుంట భూమి రోజురోజుకు కు చుంచుక పోతుంది. రేకులు ఏర్పాటుచేసిన భూభాగంలోని గతంలో కోర్టు నుంచి వెలువడిన ఉత్తర్వుల బోర్డు సైతం ఏర్పాటు చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
-రికార్డులను పరిశీలిస్తాం..
నల్లకుంట భూభాగం గతంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనే వివరాలను పూర్తిస్థాయిలో తీసుకొని రికార్డులను చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కబ్జాల గురికాకుండా చూడవలసిన బాధ్యత తీసుకుంటాం. నల్ల కుంట పై వచ్చిన ఫోటోలను కూడా పూర్తిస్థాయిలో పరిశీలనలోకి తీసుకొని పరిశీలిస్తాం. అన్ని వివరాలు తెలుసుకొని ముందుకు సాగుతాం.
కరుణాకర్, తాసీల్దార్, జడ్చర్ల