calender_icon.png 23 December, 2024 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్విన్ లోటు పూడ్చేదెవరు?

21-12-2024 12:51:57 AM

* పోటీలో జడేజా, సుందర్, అక్షర్

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో అశ్విన్ రిటైర్మెంట్‌తో ఒక శకం ముగిసినట్లయింది. దాదాపు 14 ఏళ్ల పాటు టెస్టు క్రికెట్‌లో ప్రధాన ఆఫ్ స్పిన్నర్‌గా కొనసాగిన అశ్విన్ బోర్డర్ సిరీస్ జరుగుతున్న సమ యంలోనే అర్థంతరంగా ఆటకు గుడ్ బై చెప్పాడు. దీంతో ఈ ఆఫ్ స్పిన్నర్ స్థానా న్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తిగా మారిం ది. ఇప్పటికైతే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రధాన ఆఫ్ స్పిన్నర్‌గా కనిపిస్తున్నప్పటికీ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 36 ఏళ్ల జడేజా మహా అయి తే మరో రెండేళ్లు మాత్రమే జట్టులో కొనసాగే అవకాశముంది. దీంతో ఆఫ్ స్పిన్నర్లున సుందర్, అక్షర్‌లో ఒకరు జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా మారే అవకాశముంది.

అక్షర్‌తో పోలిస్తే సుందర్ ఒక మెట్టు పైనే ఉన్నాడు. ఇటీవలే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సుందర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. అటు బౌలింగ్‌లో వికెట్లు తీస్తూనే.. ఇటు బ్యాటింగ్‌లోనూ ఉపయుక్తమైన పరుగులు సాధిస్తుండడంతో అతనివైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశ ముంది. సుందర్ వయస్సు పాతికేళ్లే కావడం అతనికి ప్లస్సుగా మారనుంది. మంచి ఆల్‌రౌండర్ ట్యాగ్ ఉన్న అక్షర్ నుంచి స్థిరమైన ప్రదర్శన ఆశించలేము. పరుగులు కట్టడి చేస్తునప్పటికీ వికెట్లు ఎక్కువగా తీయలేడన్న ముద్ర అక్షర్ పటేల్‌కు ఉంది.