calender_icon.png 15 April, 2025 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏవోను నియమించారు..

14-04-2025 01:46:15 AM

  1. ల్యాబ్ ఏర్పాటు మరిచారు!
  2. భూసార పరీక్షా కేంద్రం ఏర్పాటు ఏమైనట్టు? 
  3. పంట మార్పిడి విధానం అమలయ్యేనా? 

మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): భూసార పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా పంటల మార్పిడి విధానం, సేంద్రీయ పద్ధతులు, ఎరువులు రసాయన పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసార పరీక్షా (సాయిల్ టెస్టింగ్ ల్యాబ్) కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

అందుకు తగ్గట్టుగానే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం భూసార పరీక్షా కేంద్రంలో భూసా ర పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారిని నియమించింది. అయితే భూసార పరీక్షా కేంద్రాన్ని మాత్రం ఏర్పాటు చేయకుండా వదిలేశారు. ఫలితంగా భూసార పరీక్షలు నిర్వహించేందుకు నియమించిన సాయిల్ టెస్టింగ్ ఏవో జిల్లా కేంద్రంలో వ్యవసాయ అధికారి కార్యాలయంలో ప్రత్యామ్నా య విధులు నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడు దశాబ్దాల క్రితం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొంతకాలం పరీక్షలు నిర్వహించేందుకు తాత్కాలిక పద్ధతిలో వ్యవసాయ అధి కారి, సిబ్బందిని నియమించారు. భూసార పరీక్షా కేంద్రం ల్యాబ్ కు అవసరమైన పరికరాలను కేసముద్రం మార్కెట్ నిధులతో సమకూర్చారు.

అప్పట్లో ప్రతి ఏటా వేసవి కాలంలో రైతుల వ్యవసాయ భూముల్లో మట్టి నమూనాలను తీసుకువచ్చి పరీక్షా కేంద్రంలో పరీక్షలు నిర్వహించి పంటల మార్పిడి, భూసార పెంపుకు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేవారు. అందుకు తగ్గట్టుగా రైతులు పంట మార్పిడి, ఎరువుల వినియోగాన్ని అమలు చేసి భూసార పెంపుకు అవస రమైన చర్యలు తీసుకునే వారు. అయితే రాను రాను భూసార పరీక్ష కేంద్రాన్ని పట్టించుకోకుండా వదిలేశారు.

ల్యాబ్ నిర్వాహన కు నియమించిన ఏవో, అటెండర్ ను కూడా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో భూసార పరీక్ష కేంద్రం మూతపడింది. అనంతరం కేసముద్రం వ్యవసాయ మార్కె ట్ ఈ నామ్ విధానం అమలు చేయడంతో భూసార పరీక్ష కేంద్రాన్ని పూర్తిగా తొలగించి అందులో వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించే ల్యాబ్ ఏర్పా టు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయ అభివృద్ధికి ప్రతిష్టమైన చర్యలు తీసుకుం టామని, భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు, వ్యవసాయ పరికరాలను రాయితీపై అందిస్తామని ప్రకటిం చింది.

ప్రకటించిన విధంగానే కేసముద్రం భూసార పరీక్ష కేంద్రానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారిని నియమిం చారు. అయితే ఏడాది దాటినా కేసముద్రంలో భూసార పరీక్షా కేంద్రం ప్రారంభించకుండా కాలయాపన చేస్తుండడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల కుపైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఖుష్కి భూమిలో మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటలు  ఎక్కువగా సాగు చేస్తుండగా, తరి భూముల్లో వరి సాగు చేస్తున్నారు.

పంటల మార్పిడి విధానం పెద్దగా అమలు చేయడం లేదు. కేవలం సంప్రదాయ పద్ధతిలోనే పంటల సాగు చేస్తున్నారు. భూసార పరీక్షలు లేకపోవడంతో భూసారం పెంపు, నేల సారానికి అనుగుణంగా పంటల మార్పి డి విధానం అమలు కావడం లేదు. ఇప్పటికే రెండు సీజన్లు దాటిపోయాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో భూసార పరీక్షా కేంద్రం ప్రారంభించి, ఈ సీజన్లో భూసార పరీక్షలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.

పరీక్షా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం

కేసముద్రం భూసార పరీక్షా కేంద్రం నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ అధికారిని గత ఏడాది నియమించింది. భూసార పరీక్షల నిర్వహణకు అవసరమైన బడ్జెట్ కూడా కేటాయించారు. ప్రస్తుతం ఏవో జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. కేసముద్రంలో భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటుకు త్వరలో చర్యలు తీసుకుంటాం. 

-  విజయనిర్మల,జిల్లా వ్యవసాయ అధికారి