09-03-2025 12:00:00 AM
మనలో చాలామంది ఒక కప్పు కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. సాధారణంగా కాఫీ అంటే ఇష్టపడనివారు ఉండరు. కాఫీ తాగకపోతే ఆ రోజు ఏదో కోల్పోయినట్టు భావిస్తుంటారు. కాఫీ తాగ డం మంచిదా.. చెడ్డదా అనే విషయమై అనేక అధ్యయనాలు జరిగాయి. అయితే ప్రస్తుతం ఎవరు కాఫీ తాగకూడదనే విషయం కూడా చర్చనీయాంశమవుతోంది. ఎందుకో తెలుసా..
అధిక కెఫిన్ తీసుకోవ డం (రోజుకు 400- మి.గ్రా కంటే ఎక్కువ) వల్ల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యంగా ఎముకలు సన్నబడటానికి, త్వరగా వృద్ధాప్యానికి దారితీస్తుంది. ఆందోళన, నిద్రలేమికి కూడా కారణమవుతుంది. 40,000 మందిపై జరిగిన ఒక అధ్యయనంలో కాఫీ తాగని వారిలో చనిపోయే ప్రమాదం 16శాతం తక్కువగా ఉందని, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 31శాతం తక్కువగా ఉందని తేలింది.
అలాంటివారు తాగితే..
ఆందోళన లేదా నిద్రలేమి ఉన్నవారు కెఫిన్‌కు దూరంగా ఉండాలి. ఒకవేళ కాఫీ తాగితే విశ్రాంతి లేకపోవడాన్ని పెంచుతుంది.
అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రక్తపోటు స్థాయిల్లో తాత్కాలిక హెచ్చుతగ్గులకు కారణమవుతుంది.
గర్భిణులు చాలా తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల పిండం అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.
గుండె జబ్బులు లేదా హృదయ స్పందనలు ఉన్నవారు కాఫీ తాగితే గుండె దడ పెరుగుతుంది.
పేగు సమస్యలతో బాధపడేవారు కూడా దూరంగా ఉండాలి.
నష్టాలివే
త్వరగా వృద్ధాప్యం
ఆందోళన
నిద్రలేమి
తలనొప్పి
చిరాకు