10-03-2025 01:38:47 AM
అటవీ ప్రాంతాల్లో మూగజీవులకు తాగునీటి కోస
నీటి నిల్వకు కుండీలు ఏర్పాటు చేసి నీరు పెట్టని అటవీశాఖ
అధికారుల నిర్లక్ష్యం వల్ల మూగజీవులకు తప్పని నీటి తిప్పలు
మహబూబ్ నగర్, మార్చి 9 (విజయ క్రాంతి) : అడవి ప్రాంతాల్లో మూగజీవులకు దాహం తీర్చేది ఎవరైనా ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది. స్పందించాల్సిన అధికారులు ఆమడ దూరంలో ఉంటూ మూగజీ వులకు తాగునీరు ఉంచడం లేదు. నామమాత్రక చర్యలు తీసుకుంటే జంతువులు తీవ్ర ఇబ్బందులకు గురే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే మనుషులు నివాస ప్రాంతాలైన గ్రామాలలో తాగునీరు రాకుంటే అడిగేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ఉన్నత స్థాయి అధికారులు సమీక్షలు నిర్వహించి తాగునీరుని వెంటనే అందుబాటులోకి ఉంచాలని చెబుతుంటారు. ఇవి అమలు అవుతుంటాయి కూడా.
కాగా నోరులేని మూగజీవు లకు అడవి ప్రాంతాల్లో జంతు సంరక్షణ నిమిత్తం వేసవిలో నీటి లభ్యతను అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ఆచరణలో మాత్రం అందనంత దూరంగా ఉంటున్నారు. అడవి ప్రాంతాల్లో నీటిని అందుబాటులో ఉంచుతున్నామని నీటి తోటిలను ఏర్పాటు చేసి వాటిలో నీరు మాత్రం పోయడం లేదు.
దీంతో జంతువు ప్రేమికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వేసవి తీవ్రత అధికంగా ఉండడంతో అడవిలో ఏర్పాట చేసిన తొట్టిలలో నీరు ఏర్పాటు చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అడవి ప్రాంతం అత్యధిక ఉన్న మన జిల్లాలో అడవి ప్రాంతాల్లోనే ఉంటున్న మూగజీవుల సంరక్షణ నిమిత్తం నీరును అందుబాటులో ఉంచాలని కోరుతుండ్రు.
మూగజీవులు తొట్టిలలో చూసి తాగేందుకు నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతు న్నాయనే పరిస్థితులు ఉంటాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై డిఎఫ్‌ఓ సత్యనారాయణ ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో స్పందించి అడవి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తొట్టిలలో నీరును ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.