మహారాష్ట్రతో పాటుగా వచ్చే నెల జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎ న్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రా లు కూడా అటు బీజేపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు కీలకమైనవే. ఎందు కంటే మహారాష్ట్రలో బీజేపీ అధికార ‘మహాయుతి’ కూటమిలో భాగస్వామిగా ఉం డగా, జార్ఖండ్‌లో కాంగ్రెస్ హేమంత్ సోరే న్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తిమోర్చా( జేఎంఎం)తో కలిసి అధికారంలో కొనసాగుతోంది.
మహారాష్ట్రలో అధికారాన్ని నిల బెట్టుకోవడానికి బీజేపీ ఎంత పట్టుదలతో ఉందో, జార్ఖండ్‌లో మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌జేఎంఎం కూట మి అంతే కృతనిశ్చయంతో ఉంది. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, 23న ఫలితాలను ప్రకటించనున్నారు. గిరిజన జనాభా అధిక శాతం ఉన్న జార్ఖండ్‌లో అన్ని పార్టీలు ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకోవడడం ద్వారా అధికారంలోకి రావాలనే ప్రయత్నిస్తున్నాయి.
ఈ విషయంలో హేమంత్ సోరేన్ నేతృత్వంలోని జేఎంఎం మిగతా పార్టీలకన్నా కాస్త అడ్వాంటేజ్‌లో ఉందని చెప్పవచ్చు. ఎం దుకంటే హేమంత్ సోరేన్ తండ్రి శిబూ సోరేన్ గిరిజనుల్లో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందడమే కాకుండా మూడు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేం ద్రంలో మంత్రిగా కూడా పని చేశారు. ఎన్నికల పొత్తులో భాగంగా జేఎంఎం ఈ సారి 41స్థానాల్లో పోటీ చేయనుండగా కాంగ్రెస్ 30 స్థానాల్లో , లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ6 స్థానాల్లో, సిపిఐ ఎంఎల్( లిబరేషన్) 4 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
ఇక ఎన్డీఏ కూటమిలో బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తుండగా, సుధేశ్ మహతో నేతృత్వంలోని ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్(ఏజేఎస్‌యూ) 10, జనతాదళ్ యునైటెడ్( జేడీయూ)2, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ( ఎల్.ఏపీ) ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి.
రాజకీయ అనిశ్చితి
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గత 24 ఏళ్ల జార్ఖండ్ చరిత్రలో ఇప్పుడు జరుగుతున్నవి అయిదో అసెంబ్లీ ఎన్నికలు. కా నీ ఏడుగురు వ్యక్తులు 13 సందర్భాల్లో ముఖ్యమంత్రి గద్దెనెక్కారు. మూడు సార్లు రాష్ట్రపతి పాలనను కూడా రాష్ట్రం చవి చూసింది. బీజేపీకి చెందిన రఘుబర్‌దాస్ ఒక్కరే అయిదేళ్లు పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక 2005 అసెంబ్లీ ముగ్గురు ముఖ్యమంత్రులను చూసింది. అంతేకాదు ఇప్పటివరకు ఏ పార్టీ కూడా వరసగా రెండో సారి అధికారంలోకి రాలే దు. అంటే రాష్ట్రంలో ఎంతగా రాజకీయ అనిశ్చితి ఉందో అర్థం అవుతుంది.
రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న హేమంత్ సోరేన్ మదిలో ఈ విషయం ని త్యం కదలాడుతూనే ఉండవచ్చు. ఎందుకంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి మెజారిటీ స్థానాల్లో విజయం సా ధించినప్పటికీ, బీజేపీ తన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందన్న భయంతో రెండుసార్లు ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలను చత్తీస్‌గఢ్‌కు తరలించాల్సి వచ్చింది. మరోవైపు 2022లో పశ్చిమ బెంగాల్‌లో భారీ మొత్తంలో నగదుతో పట్టుబడిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ బహిష్కరించింది.
అన్నిటికన్నా మంచి మిగతా బీజేపీ యేతర పాలిత రాష్ట్రాల సీఎంల మాదిరిగానే సోరేన్‌కు కూడా కేంద్ర దర్యాప్తు సం స్థలనుంచి దాడులను ఎదుర్కోక తప్పలే దు. ఫలితంగా రాంచీలో భూకుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై అయిదు నెలలపాటు జైల్లో గడపాల్సి వచ్చింది. అ యితే ఇది హేమంత్ సోరేన్ పట్ల ప్రజల్లో సానుభూతిని తీసుకువచ్చి ఉండవచ్చు కా నీ రాజకీయంగా మాత్రం నష్టాన్నే తెచ్చిపెట్టింది.
తాను లేని సమయంలో ముఖ్య మంత్రి బాధ్యతలు నిర్వహించడం కోసం తనకు ఎంతో విశ్వసపాత్రుడయిన చంపై సోరేన్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించిన ఆయన జైలునుంచి విడుదలయిన వెంటనే తిరిగి మఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి చంపై సోరేన్‌ను రాజీనామా చేయా లని కోరడం ఆయనలో తీవ్ర అసంతృప్తికి కారణమయింది. చివరికి చంపై సోరేన్ బీజేపీ గూటికి చేరారు కూడా.
కలిసిరాని ఒంటరి పోరులు
అయితే అధికారంలోకి రావాలంటే ఇ తర పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చే యడమొక్కటే మార్గమని ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీలకన్నిటికీ అర్థమయిం ది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అప్పుడు ఆ రెండు పార్టీలకు వచ్చిన మొ త్తం స్థానాలు 25 మాత్రమే. అదే 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసి 47 స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వచ్చాయి.
అలాగే 2019లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ 25 సీట్లు మాత్రమే దక్కించుకోగా 2014లో ఏజేఎస్‌యూతో కలిసి పోటీ చేసినప్పుడు 42 స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుతం బీజేపీ కూటమి లో భాగస్వాములుగా ఉన్న జేడీ(యూ), ఎల్‌జేపీలు 2019లో ఒంటరిగా పోటీ చేసి తాము పోటీ చేసిన అన్ని సీట్లలో డిపాజి ట్లు కోల్పోయాయి. అందుకే ఈ వాస్తవాలు గ్రహించిన రెండు కూటముల్లోని పార్టీలన్నీకూడా సీట్ల కోసం పెద్దగా పట్టుబట్టలేదు.
బీజేపీకి రిజర్వుడ్ స్థానాల భయం
నిజానికి ఒకప్పుడు జార్ఖండ్ బీజేపీ కంచుకోటగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన 24 ఏళ్లలో 13 ఏళ్ల పాటు ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో కొనసాగింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఆ ఆధిక్యత మరోసారి స్పష్టంగా కనిపించింది. రాష్ట్రంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో 9 స్థా నాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇంత బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో రాష్ట్రంలో అధికారంలోకి రావడంపై ధీమా కనిపించడం లేదు. దానికి ప్రధాన కారణం రా ష్ట్రంలోని గిరిజనుల కోసం రిజర్వ్ చేసిన 28 అసెంబ్లీ స్థానాలే.
మొత్తం ఓటర్లలో 28 శాతం ఉన్న గిరిజనుల్లో ఆ పార్టీ పట్టు 2019నుంచి కూడా క్రమంగా తగ్గుతూ వ స్తోంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే ధోరణి కనిపించింది. ఎస్టీలకు రిజర్వ్ చేసిన అయిదు లోక్‌సభ స్థానాల్లోనూ ఆ పార్టీ ఓడిపోయింది. గిరిజన ఓట్ల ప్రాధాన్యతను గుర్తించి గిరిజన నాయకుడు బాబూలాల్ మరాండీని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించినా పార్టీకి నిరాశే మిగి లింది. మరోవైపు రాష్ట్రంలోని గిరిజనుల్లో జేఎంఎంకు మొదటినుంచి కూడా గట్టి ప ట్టు ఉంది. తాము అధికారంలోకి రావాలంటే జేఎంఎం పట్టునుంచి గిరిజన ఓట ర్లను తమవైపు తిప్పుకోవలసిన అవసరం ఉందని గ్రహించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముం దే గత రెండు నెలల్లో రాష్ట్రంలో రెండుసా ర్లు పర్యటించారు.
ఇదే కాకుండా ప్రధానమంత్రితో కనీసం ఏడు భారీ బహిరంగ స భలు నిర్వహించాలని కూడా బీజేపీ భావిస్తోంది. దీనితో పాటు గా ముగ్గురు గిరిజన మాజీ సీఎంలు చం పై సోరేన్, అర్జున్ ముండా, మధుకోడాలపై ఆ పార్టీ కొండం త ఆశలు పెట్టుకుంది. ఎస్టీ రిజర్వుడ్ స్థానాలతో పాటుగా సంతాల్ పరగణాల ప్రాం తం కూడా బీజేపీకి కొరకరాని కొయ్యగానే ఉంది. 18 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాం తంలో మైనారిటీ ఓట్లు కీలకం వహిస్తున్నాయి. ఇక్కడ కూడా బీజేపీకి దక్కిన సీ ట్లు నామమాత్రమే.
మరోవైపు జైలునుం చి విడుదలై తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పటినుంచి హేమంత్ సోరేన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ వస్తున్నారు. సంక్షేమ పథకాలద్వారా లబ్ధిపొంది న లక్షలాది మంది మహిళలే తమ పార్టీకి అండ అని జేఎంఎం భావిస్తుండగా, దాన్ని ఎలా తిప్పికొట్టాలనే దానిపై కమలనాథులు ఎత్తులు, పైఎత్తులు వేస్తూ ఉన్నారు. హర్యానా ఎన్నికల్లో లాగా పక్కా వ్యూ హంతో ముందుకు సాగుతున్న ఆ పార్టీ అలాంటి అనూహ్య విజయాన్నే నమోదు చేస్తుందేమో చూడాలి.