బెర్లిన్ (జర్మనీ): ప్రతిష్ఠాత్మక యూరోకప్ చివరి అంకానికి చేరుకుంది. ఫేవరెట్స్ అనుకున్న పోర్చుగల్, ఫ్రాన్స్, జర్మనీలు నాకౌట్ దశలో వెనుదిరిగాయి. ఈ నేపథ్యంలో టైటిల్ పోరులో ఇప్పటికే మూడుసార్లు చాంపియన్ అయిన స్పెయిన్‌తో ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనుంది. యూరోకప్‌ను నాలుగోసారి గెలవాలని స్పెయిన్ భావిస్తుండగా.. తొలిసారి యూరోకప్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్ ఉవ్విళ్లూరుతోంది.