15-02-2025 01:21:37 AM
వాషింగ్టన్, ఫిబ్రవరి 14: మస్క్ గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీ బస చేసిన బ్లె యిర్ హౌస్‌లో తన పిల్లలతో కలిసి భేటీ అయిన సంగతి తెలిసిందే. మీటింగ్‌కు మస్క్‌తో పాటు వచ్చిన మహిళ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె మస్క్ తాజా భాగస్వామి షివోన్ జిలిస్ అని బయటపడింది. ప్రస్తుతం షివోన్ జిలిస్.. మస్క్ కంపెనీ న్యూరాలింక్‌లో డైరెక్టర్ ఆపరేషన్స్ విధులు నిర్వర్తిస్తోంది. షివో న్ జిలిస్ తల్లిది భారత్ కావడం గమనార్హం
మస్క్ పిల్లలకు బహుమతులు
మస్క్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ ఆయన పిల్లలకు మూడు పుస్తకాలను అందజేశారు. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన “ద క్రిసెంట్ మూన్” పుస్తకం కూడా ఇందులో ఉంది. అంతే కాకుండా విష్ణుశర్మ రచించిన “పంచతంత్రం” పుస్తకం ఉంది.