calender_icon.png 19 April, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్పి ఎవరో ఈ శిల్పమెనుక..

05-04-2025 12:00:00 AM

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజాచిత్రం ‘సింగిల్’. కార్తీక్‌రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, కళ్యాఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కేతికశర్మ, ఇవానా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్-గా ‘శిల్పి ఎవరో’ పాటను శుక్రవారం విడుదల చేశారు. ‘శిల్పి ఎవరో.. ఈ శిల్పమెనుక..’ అంటూ సాగుతున్న ఈ పాట విశాల్‌చంద్రశేఖర్ సంగీత సారథ్యంలో మెలోడీగా రూపుదిద్దుకుంది. శ్రీమణి గీత సాహిత్యం అందించగా, యాజిన్ నిజార్ ఆలపించారు. ఈ చిత్రానికి సమర్పణ: అల్లు అరవింద్; సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్‌రాజ్; డైలాగ్స్: భాను భోగవరపు, నందు సవిరిగాన; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్; ఆర్ట్: చంద్రిక గొర్రెపాటి; నిర్మాతలు: విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి; రచనాదర్శకత్వం: కార్తీక్‌రాజు.