calender_icon.png 9 January, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసలు యజమాని ఎవరు?

26-10-2024 12:00:00 AM

ఒకసారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటలు గురించి విని ఆయనని చూడాలని ఒక రైతు వేషం ధరించి గుర్రం మీద రాజధాని వైపు బయలుదేరాడు. 

దారిలో ఒక కుంటి వ్యక్తి రహదారులకు సహాయమడుగుతూ కనిపించాడు. సామంతరాజు జాలిపడి ఆ వ్యక్తికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు. అతను రాజధాని వెళ్ళాలని చెప్పాడు. 

సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రం యెక్కించి తను నడవ సాగాడు. 

రాజధాని చేరాక ఆ కుంటి వాడు దిగడానికి ఇష్టపడలేదు. కేకలూ.. అరుపులూ మొదలు పెట్టాడు. సామంతరాజు నిర్ఘాంతపోయి చూస్తుండగా చుట్టూర పదిమంది చేరారు. 

కుంటివాడు చుట్టూ చేరిన జనానికి తనదే గుర్రమని, ఆ రైతు వేశంలో ఉన్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు. సామంతరాజు గుర్రం అతనిదని, సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్లు చెప్పాడు. 

ఇద్దరు కలిసి అక్బర్ చర్రవర్తి దర్బారుకి న్యాయం కోసం వచ్చారు. అక్బర్, బీర్బల్‌ను న్యాయం చెప్పమన్నాడు. 

బీర్బల్ గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టేయమని ఆదేశించి, వీళ్ళిద్దరిని మరునడు మళ్లి దర్బారుకి రమ్మన్నాడు.

తెల్లవారింది. 

ఇద్దరు దర్బారులో హాజరయ్యారు. బీర్బల్ ఇద్దరిని గుర్రపుశాలకి తీసుకువెళ్లి.. కుంటాడిని “‘నీ గుర్రం తీసుకో”, అన్నాడు. 

అక్కడ అన్ని గుర్రల మధ్య తనదని వాదించిన గుర్రం తెలుసుకోలేక బిక్క ముఖం వేశాడు. 

అదే సామంతరాజు వెంటనే తన గుర్రాన్ని గుర్తుపట్టేశాడు. గుర్రం కూడా యజమానిని చూసి సంతోషంగా సెకిలించింది. 

వెంటనే బీర్బల్ కుంటాడిని శిక్షించమని, గుర్రానికి అసలు యజమాని సామంతరాజు అని అక్బర్‌కి నివేదించాడు. 

సామంతరాజు ఎంతో సంతోషంతో తనెవరో చెప్పి బీర్బల్ని  ప్రశంసించి మళ్ళీ తన రాజ్యానికి బయలుదేరాడు.