calender_icon.png 3 April, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూత్రధారి ఎవరు?

30-03-2025 01:15:59 AM

ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ 

పరికరాలు కొనుగోలు చేసిందెక్కడ?

విదేశీ పర్యటనకు ఎందుకు వెళ్లారు? 

 ఎన్నికల సమయంలో ఎంతమంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు 

 ఆరున్నర గంటల పాటు శ్రవణ్‌రావును విచారించిన సిట్ 

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ము మ్మరం చేసింది. ఈ కేసులో ఏ ఉన్న మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావును శనివారం విచారించింది.

ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు? మీ మీడియా సంస్థ ఆఫీస్‌లో సర్వర్ ఎందుకు ఏర్పాటుచేశారు? అలా ఏర్పాటు చేయమని చెప్పింది ఎవరు? మీ వద్ద ట్యాపింగ్ పరికరాలు ఎంతకాలం ఉన్నాయి? ట్యాంపిగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని నాటి ప్రభుత్వంలోని పెద్దలకు ఎలా చేరవేశారు? అంటూ ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్‌రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది.

జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ గిరి ఆధ్వర్యంలో సిట్ అధికారులు శ్రవణ్‌రావును దాదాపు ఆరున్నర గంటల పాటు విచారించారు. ఓ మీడియా సంస్థ నిర్వహాకుడిగా ఉన్న శ్రవణ్‌రావు.. ఫోన్ ట్యాపింగ్ సర్వర్ సహా ఇతర పరికరాలను తన ఆఫీస్‌లోనే పెట్టుకుని, నాటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ఆదేశాలతో తతంగం అంతా నడిపారన్నది ఆయనపై ఉన్న ఆరోపణ. ఫ్యోన్ ట్యాపింగ్ అంశంపై పోలీసులు కేసు నమోదు చేయగానే.. ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. అయితే శ్రవణ్ రావు విదేశాలకు వెళ్లిపోయేనాటికి ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేదు. ఆ తర్వాత పోలీసులు ఏ జతచేశారు. మూడురోజుల క్రితం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో.. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన శ్రవణ్‌రావు శనివారం ఉదయం సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు.

ముక్తసరిగా సమాధానాలు 

గత ప్రభుత్వంలోని పెద్దలతో అత్యంత సన్నిహత సంబంధాలు ఉన్న శ్రవణ్‌రావును సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించారు. మీడియా ఆఫీస్‌లో సర్వర్ రూమ్‌లను ఏర్పాటు చేయమని ఎవరు చెప్పారని అడిగారు. ట్యాపింగ్ పరికరాలను ఎక్కడ కొనుగోలు చేశారని, దీనికి ఎవరైనా సహరించారా? సర్వర్ రూమ్‌లను ఎక్కడెక్కడ ఏర్పాటుచేశారు? మొద ట ఎఫ్‌ఐఆర్‌లో పేరులేకపోయినా దేశం విడిచి ఎందు కు వెళ్లారని ప్రశ్నించారు.

విదేశాలకు వెళ్లేందుకు, వెళ్లిన తర్వా త ఎవరు సహకరించారని అడిగారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కీలక నాయకుల కదలికలను తెలుసుకునేం దుకు ట్యాపింగ్ పరికరాలను ఉపయోగించారన్నది ప్రధాన ఆరోపణ. నాటి ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్య నేతల జాబితాను  తయారుచేసుకొని ట్యా పిం గ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఎన్నికల సమయంలో ఎంతమంది నేతలతో ఫోన్ ట్యాపింగ్ జాబితాను తయారుచేశారు? ఆ డేటాను ఎక్కడ స్టోర్ చేశా రు? ఇలా వరుస ప్రశ్నలతో సిట్ అధికారులు ఉక్కిరిబిక్కి చేశా రు. అయితే కొన్ని ప్రశ్నలకు శ్రవణ్‌రావు ముక్తసరిగా సమాధానాలు చెప్పినట్లు తెలిపింది. శ్రవణ్‌రావు విచారణతో ఈ కేసు విచారణలో పోలీసులు చాలా పురోగతి సాధించా రు. అయితే శ్రవణ్‌రావును మరోసారి విచారణకు పిలిచే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.