కాంగ్రెస్‌ను ప్రశ్నించిన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): రైతు రుణమాఫీ ఎగ్గొట్టిన ప్రభుత్వం.. మూసీ పేరుతో మురికి రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శనివారం ఎక్స్‌వేదికగా స్పందిస్తూ.. రైతు రుణమాఫీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను మోసం చేస్తోందన్నారు. మూసీ వెనక దాగున్న ముసుగు దొంగ ఎవరని ప్రశ్నించారు.
మహిళలకు వంద రోజుల్లో నెలకు రూ.2500 ఇస్తానని చెప్పి కాంగ్రెస్ తప్పించుకొని తిరుగుతుందన్నారు. గ్రామాల్లో బతుకమ్మకు ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ వాపోయారు. తెలంగాణ అస్తిత్వమైన బతుకమ్మ పండగ అంటే సీఎం రేవంత్‌రెడ్డికి గిట్టదన్నారు.