calender_icon.png 18 November, 2024 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ గార్డులకు గార్డు ఎవరు?

12-08-2024 12:31:38 AM

  1. హిండెన్‌బర్గ్ నివేదికపై విపక్షం ఎంటర్
  2. మోదీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు
  3. అదానీ రక్షకులను రక్షిస్తున్నారని విమర్శ

న్యూఢిల్లీ, ఆగస్టు 11: అదానీ చీఫ్ ఆర్థిక బంధంపై అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో నివేదిక బయటపెట్టడంతో రాజకీయ దుమారం మొదలైంది. అదానీ షెల్ కంపెనీల్లో స్వయంగా సెబీ చైర్‌పర్సన్‌కే వాటాలున్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ వాటాల వల్లనే ఆమె అదానీ గ్రూప్ అక్రమాలను దాచిపెట్టి క్లీన్‌చిట్ ఇచ్చారని తీవ్ర విమర్శలు గుప్పించింది. కంపెనీల అక్రమాలను అరికట్టాల్సిన సంస్థే అక్రమాలకు పాల్పడితే ఎవరిని అడగాలని కాంగ్రెస్ నేత జైరాంరమేశ్ ఆదివారం ప్రశ్నించారు.

అదానీని రక్షిస్తున్న గార్డులకు రక్షణ కల్పిస్తున్న పెద్ద గార్డు ఎవరు అని నిలదీశారు. స్టాక్‌మార్కెట్‌ను రక్షించాల్సిన వారే ఇలా వ్యవహరిస్తే అందులో పెట్టుబడులు పెట్టడం ఎంత ప్రమాదమో ఆలోచించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మండి పడ్డారు. సెబీ చీఫ్ ఆమె భర్త ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ శశీథరూర్ డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్‌లో సెబీ చైర్‌పర్సన్ పెట్టుబడులు పెట్టడం క్రోనీ క్యాపిటలిజానికి పరాకాష్ట అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు.