01-04-2025 12:00:00 AM
దేశంలో దేవాదాయ శాఖ అంటూ ఒకటి లేనప్పుడు, ఆ రోజుల్లో హిందు దేవాలయాల నిర్వహణ సరిగ్గా లేదని, వాటి పాలకమండళ్లలో అవినీతి, అస్తవ్యస్త విధానాలు పెరిగాయని చెబుతూ అన్నింటినీ సరిదిద్దే బృహత్ లక్ష్యంతో ప్రభుత్వాలు చట్టబద్ధంగా వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. కానీ, దశాబ్దాల అనంతరం పరిస్థితులు ఇప్పుడు రివర్స్ అయ్యాయనిపిస్తున్నది. ప్రభుత్వాల ఆధ్వర్యంలోనూ వాటికి న్యాయం జరగడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హిందు దేవాలయాలను ప్రభుత్వాల నుంచి ఎందుకు విడిపించకూడదు? అన్న ఆకాంక్ష వ్యక్తమవుతున్నది. ఐతే, వాటిని మళ్లీ వెనక్కి తీసుకెళితే, ఆలయ వ్యవస్థలను అంత సమర్థవంతంగా, ధర్మబద్ధంగా, అందరికీ అనుకూలంగా, అవినీతి అక్రమాలకు అతీతంగా నిర్వహించగల నిబద్ధ వ్యవస్థను ఏర్పరచుకోగలమా? అన్నది పెద్ద ప్రశ్న.
ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వ్యక్తికి కులం, మతం అనే తారతమ్యా లు లేకుండా సమాన హక్కులు ఉంటా యి. కానీ, భారతదేశంలో సెక్యులరిజాన్ని అనుసరిస్తున్నప్పటికీ, మైనారిటీల ఓటుబ్యాంకు కోసం మెజారిటీ ప్రజల సంక్షే మాన్ని తక్కువగా పట్టించుకుంటున్నారని మెజారిటీ హిందూ ప్రజలు భావిస్తున్నా రు. హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న భారతదేశంలో హిందూ దేవాలయా ల నిర్వహణలో వారికి ప్రాధాన్యం లేకపోవడం, ఇతర మత ప్రార్థనా స్థలాల నిర్వ హణలో వాటి మత సంస్థలకు పూర్తి స్వేచ్చ ను ఇవ్వడాన్ని హిందూ సమాజం భరించలేక పోతున్నది. దీనికి తోడు హిందూ దేవాలయాల నుంచి వచ్చిన నిధులను ఇతర మత సంస్థల నిర్వహణకు ఉపయోగిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో తీవ్రంగా నాటుకుపోతోంది.
భారతదేశంలో 33,000 ప్రత్యేక దేవాలయాలు, 52 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లిం గాలతోసహా మొత్తం 18 లక్షల దేవాలయాలు ఉన్నాయి. నేషనల్ శాంపిల్ సర్వే అంచనా ప్రకారం, హిందువులు మత పరమైన తీర్థయాత్రల కోసం ఏటా రూ. 4.74 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ యాత్రలవల్ల దేశవ్యాప్తంగా దాదాపుగా 8 కోట్ల మందికి జీవనోపాధి దొరుకుతోంది. పూలు, నూనె, దీపాలు, పరిమళ ద్రవ్యా లు, కంకణాలు, పూజా సామాగ్రి, పెయింటింగ్స్ వంటివన్నీ అమ్ముతూ లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారనే చేదు నిజా న్ని దేవాలయాల నిర్మాణాలను వ్యతిరేకించే పెద్దలు అర్థం చేసుకోవాలి. ఒక చిన్న దేవాలయం కూడ కనీసం 10 మంది కి జీవనోపాధిని అందిస్తుంది.
ఉదా॥ కాశీ విశ్వనాథ్ ఆలయంలో వీల్‌చైర్లతో ఉన్న వ్యక్తులు రోజుకు కనీసం రూ.1,000 సం పాదిస్తారు. వివిధ దేవాలయాలలో చంద నం పూసేవారు రోజుకు రూ.300 500 వరకు సంపాదిస్తారు. విచిత్రమైన విష యం ఏమిటంటే సోమనాథ్, అమర్నాథ్, వైష్ణోదేవి తీర్థయాత్రల నుంచి సంపాదిస్తు న్న వారిలో 60 నుంచి 80 శాతం ఆలయాల నుంచి ముస్లింలకు కూడా వెళు తుంది. మరోవైపు దేశ జీడీపీకి హిందూ దేవాలయాలు మాత్రమే 2.32 శాతం సహకరిస్తున్నాయని ‘నేషనల్ శాంపిల్ సర్వే’ డేటా పేర్కొంది. 65 కోట్లకు పైగా పాల్గొన్న మొన్నటి కుంభమేళాలో 5 కోట్లకు పైగా మైనారిటీ సహోదరులు లబ్ధి పొందినట్లు తెలుస్తోంది.
వివక్ష ఎందుకు?
దేశంలో 3.5 లక్షలకు పైగా మసీదులు ఉన్నాయి. కానీ, అవి ఉపాధిని సృష్టించ డం లేదు. అలా కాకుండా చాలా రాష్ట్రాల్లో ఇమామ్‌లు, మౌల్వీలకు ప్రభుత్వం జీతా లు చెల్లిస్తూ ఖజానాకు భారం మోపుతోం ది. దేశంలో 9.40 లక్షల ఎకరాలు వక్స్ భూములు మాత్రమే ఉన్నాయని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెబుతున్నా రు. తమిళనాడులో దేవాలయాలు, మఠం భూములు 4.78 లక్షల ఎకరాలు. ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ధర్మాదాయ భూము లు 4 లక్షల ఎకరాలు. తెలంగాణలో 87,000 ఎకరాలు, ఒడిశాలో 13 దేవాలయాల ఆధీనంలో 12,776 ఎకరాలు ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లోనే 10 లక్ష ల ఎకరాలు ఉంది. హిందూ దేవాలయాలకు వచ్చిన విరాళాలు, హిందు సంస్థల ఆర్థిక వనరులపై ప్రభుత్వానికి పెత్తనం ఉంటుందిట, అంతేకాదు ఆదాయ పన్ను కూడా చెల్లించాల్సి ఉంది. కానీ, ఇతర మత సంస్థలు ఎలాంటి పన్నులు చెల్లించనవసరం లేదు. హిందూయేతర సంస్థలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, ఇతర సంస్థలపైన ప్రభుత్వ పెత్తనం పరిమితంగా ఉంటున్నది. హిందూ దేవాలయాల నిర్వహణలో చట్ట ప్రకారం ఆలయ నిర్వాహకు లకు అధికారం ఉండదు. ఇతర మతసంస్థల నిర్వహణలో ఆయా మతసంస్థలకు స్వేచ్ఛ ఉంది. ఈ వివక్ష పైనే హిందూ సంస్థలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
నియంత్రణ అవసరమా?
దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేయాలని లేదా ఇతర మతస్తుల ఆలయాలను కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలని చాలా మంది పదేపదే డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇతర మతస్తుల ఆలయాల వల్ల ప్రభుత్వానికీ ఎలాంటి ఆదాయం రాదని, వాటిని నియంత్రించడం వల్ల సర్కార్‌కి ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా ఓటు బ్యాంక్ దెబ్బ తింటుందనే భయం వల్లనే ప్రభుత్వాలు అటువైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఒక్కప్పుడు గుళ్లోని దేవుడినే సర్వాధికారిగా ఎంచి, తాము కేవలం దైవ సేవకులమన్న భావనతో అటు పాలకులు, ఇటు ప్రజలు సైతం దైవం పట్ల తమ బాధ్యతను నిస్వార్థంగా నిర్వహించే వారు.
కానీ, నేడు మాత్రం గుడిపై పెత్తనం చేయాలన్న దురాలోచనతో వున్న పాలకులు, అధికారుల నుంచి దేవాలయాలను ఎం దుకు విముక్తి చేయకూడదు? గతంలో ఆలయాలు సంస్కృతికి, విద్యకు, కళలకు, నాగరికతకు కేంద్రాలుగా విలసిల్లేవి. ఆ పూర్వ వైభవం మళ్ళీ తెచ్చే ప్రయత్నాలు ఎందుకు జరగడం లేదు? ఆనాటి దేవాల య కట్టడాల నిర్మాణ శైలి ఆధునిక సైన్స్‌కు కూడా అంతుపట్టడం లేదు. కానీ, అంతటి మహోన్నత నిర్మాణాలు నేడు పట్టించుకొనే వారు లేక శిథిలస్థితిలో మగ్గుతు న్నాయి. మరి, వాటి పునరుద్ధరణకు ఎం దుకు నోచుకోకూడదు? ఒకప్పుడు రాజు లు తమ సంపదలు దైవదత్తం చేసేవారు, కానీ నేటి ప్రభుత్వాలు ఆలయాలను ఆదాయపు దుకాణాలుగా మార్చివేశాయి.
వాటినుంచి ప్రభుత్వ ఖజానాకు సొమ్ము మళ్లిస్తూ ఆ డబ్బులో చాలా తక్కువ శాతం మాత్రమే దేవాలయాల నిర్వహణకు కేటాయిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఆయా ప్రభుత్వాల పెద్దలు గుడుల మాన్యాలను యథేచ్ఛగా వాడుకుంటున్నా రు. హిందు ఆలయాలను ‘ఆధ్యాత్మిక కేంద్రాలు’ అనే స్థాయి నుంచి సంపాదనా కేంద్రాలు అనే స్థితికి ఎందుకు తెచ్చారు? దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్ళు నిం డినా పరాయి పాలకులైన బ్రిటిషువారు స్వార్థపూరిత ప్రయోజనాల కోసం అమ లు చేసిన దేవాలయ చట్టాలను పట్టుకుని వేలాడడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వాలు నిజాయితీగా ఆలోచించాలి.
సమదృష్టితో నిర్ణయాలు
భారతదేశంలో సెక్యులర్ ప్రభుత్వం మతానికి అతీతమైంది. మరి, ప్రభుత్వం వారు ఆలయాల నిర్వహణ చేయడం మం చిదేనా? దేవాలయాలను నియంత్రించే శాఖ పేరు ‘దేవాదాయ శాఖ’. ‘దేవాదా యం’ అంటే ‘దేవుని ఆదాయం’. మరి, దేవుని పేరుమీద చేస్తున్న వ్యాపారం అన్న ట్టే కదా? సాంఘిక అసమానతలు దూరం చేసి, వర్ణం కులం, ఆధారంగా కాకుండా శ్రద్ధాభక్తులు కలిగి, శిక్షణ పొందిన అర్హులైన వారిని అర్చకత్వం, ఇతర ఆలయ సేవలలో పాలు పంచుకునే సమాజం వైపు మనం ఎదగాలి. ఎన్నో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న ఈ తరుణంలో ప్రస్తుతం వున్న దేవాదాయ శాఖ నుంచి ఆలయాలు విముక్తి పొందాలి. అవి నిజమైన భక్తుల చేతుల్లోకి రావాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉంది. భారత దేశంలోని దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కు చట్ట పరిధిలో, సాంస్కృతిక సంస్థలకు అప్పగిస్తూ, దేవాలయాల గౌరవ ప్రతిష్ట ను, హైందవ సమాజ ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వాలు ఎలాంటి వివక్షలు లేకుండా సమదృష్టితో సముచిత నిర్ణయాలు తీసుకోవాలని ఆశిద్దాం.
వ్యాసకర్త: డా.బి.కేశవులు, సెల్: 85010 61659