- కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా వసూళ్లకు ప్రోత్సహిస్తున్న ఏజెన్సీలు
- ట్రాన్స్‌పోర్ట్ట్, సర్వీస్ చార్జీల పేరుతో అధిక వసూలు
- జిల్లాలో 2,93,766 గ్యాస్ కనెక్షన్లు
- 25 ఏజెన్సీల ద్వారా నెలకు సుమారు 1 లక్ష సిలిండర్ల సరఫరా
- సంవత్సరానికి సుమారు రూ. 3.5 కోట్లు దండుకుంటన్న ఏజెన్సీలు
- ఎజెన్సీలు చేసే తప్పు కార్మికులపై నెట్టుతున్న వైనం
సూర్యాపేట,ఫిబ్రవరి6(విజయక్రాంతి): జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీల నిర్వహకులు ప్రజలకు భారం అనిపించకుండా ప్రతి సిలిండ్ప రూ. 30 నుంచి రూ. 40 వరకు అధికంగా వసులు చేస్తున్నారు. ప్రస్తుతం సిలిండర్ రీపిల్లింగ్ ఖరీదు రూ. 876.50 ఉండగా ఇందులోనే ప్రభుత్వం ఏజెన్సీల కమీషన్, డెలివరీ చార్జీలు, ప్రభుత్వం అందిస్తున్న రాయితి కలిపి వసులు చేస్తున్నది.
అయితే ఏజెన్సీలు మాత్రం ప్రతి సిలిండర్కు రూ. 910 నుంచి రూ. 920 వరకు వసులు చేస్తున్నారు. జిల్లాలో ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలకు చెందిన డిస్టిబ్యూటర్ల ప్రజలకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. ప్రతి ఏజెన్సీ నిర్వహకులు దూరంతో సంబంధం లేకుండా అధిక వసుళ్ళకు పాల్పడుతున్నారనేది బహిరంగ రహస్యమే.
జిల్లా వ్యాప్తంగా 2,93,766 గ్యాస్ కనెక్షన్లు ఉండగా జిల్లాలోని 25 ఏజెన్సీల ద్వారా నెలకు సుమారు 1 లక్ష సిలిండర్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం. సరాసరి ప్రతి సిలిండ్ప రూ. 30 అధికంగా వసులు చేస్తే సాలీనా రూ. 3.6 కోట్ల దందా నడుస్తున్నదని సమాచారం.
కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతోనే డెలివరి చార్జీలు
గ్యాస్ ఏజెన్సీలలో పని చేస్తున్న గ్యాస్ డెలివరి కార్మికులకు విధిగా ఆయా కంపెనీలు వేతనాలు ఇవ్వాలి. కానీ జిల్లాలోని కొన్ని కంపెనీల యాజమానులు కార్మికులకు వేతనాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా రికార్డులు రాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇది వ్యతిరేఖించే కార్మికులను పని నుంచి తొలగించడం పరిపాటిగా మారడంతో తప్పని పరిస్థితుల్లో కార్మికులు డెలివరి చార్జీటు వసూలు చేస్తున్నారు. ఇదే వారికి వేతనం అని చెప్పవచ్చు. ఇందులో కార్మికుల తప్పు లేనప్పటికి అధికారులు కూడా కార్మికులనే భాద్యులుగా చేస్తూ ఏజెన్సీలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలు ఇలా..
ఇండియన్ ఆయిల్, బీపిసిఎల్, హెచ్పిసిఎల్ కంపెనీలకు చెందిన డిస్టిబ్యూటర్లు ప్రజల నివాసాలకు దూరంగా గోడౌన్లను ఏర్పాటు చేసుకొని సిలిండర్లను సరఫరా చేయాలి. సాదారణ డిస్టిబ్యూటర్లు తమ గొడైన్ పరిధిలో చుట్టు 15 కిలో మీటర్ల దూరం వరకు సిలిండర్ ఖరిదుపై అధికంగా వసులు చేయకుండా అందించాలి.
గోదామ్ వద్దకు లబ్దిదారులు వెళ్లి సిలిండర్ తీసుకున్నట్లయితే ఖరీదుపై రూ. 12 లబ్దిదారునికి తగ్గించి అందించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 0 నుంచి 15 కిలో మీటర్లలోపు సరఫరాకు ఎలాంటి అధిక ఖరిదు చెల్లిచవలసిన అవసరం లేదు. అదే విదంగా 16 కిలో మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు సిలిండర్ సరఫర చేస్తే రూ. 10, 30 కిలోమీటర్ల కంటే అధిక దూరం సరఫర చేస్తే రూ. 15 మాత్రమే అధికంగా తీసుకోవాలి.
ప్రభుత్వం ప్రతి సిలిండర్కు ఖరీదులోనే డెలివరి చార్జీలు, ఏజెన్సీ కమీషన్, లబ్దిదారునికి అందించే సబ్సీడీ అన్ని కలిపి ప్రతి నెల ఖరీదును నిర్ణయిస్తుంది. ఏజెన్సీ నిర్వహకులు డెలివరి బాయ్స్కి జీతాలు అందించాలే తప్ప ప్రజలనుంచి కమీషన్ వసూలు చేయడానికి వీలు లేదు.