01-03-2025 01:12:52 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో త్వరలోనే కొత్త వ్యక్తి వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 11వ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డా 2020 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. కాగా ప్రస్తుతం బీజేపీ లో రాష్ట్రాల సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నా యి. నడ్డా సారథ్యంలోనే బీజేపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయకేతనం ఎగురేసి ముచ్చట గా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
నడ్డా బీజేపీకి అధ్యక్షుడిగా కొనసాగడమే కాకుండా కేంద్రంలో ఆరోగ్యశాఖ, ఎరువుల శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. 2024లో ఆయన్ను బీజేపీ గుజరాత్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రధానికి అత్యం త సన్నిహిత వ్యక్తుల్లో నడ్డా ఒకరనే పేరుంది.
బీజేపీ ఎన్నికల నియమావళి ఏం చెబుతుందంటే..
జేపీ నడ్డా వారసుడి ఎన్నిక గురించి బీజేపీ ఎన్నికల నియమావళి ఏం చెబుతుందని అంతా ఆలోచిస్తున్నారు. బీజేపీ రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడిని ఎన్నిక ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో ఆ పార్టీ సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసి ఉండాలి.
ఇప్పటికే దేశంలో ఉన్న 12 రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసింది. జాతీయ అధ్యక్షుడి ఎన్నికను నిర్వహించేందుకు మరో ఆరు రాష్ట్రాల్లో ఆ పార్టీ యూనిట్ చీఫ్‌లను ఎన్నుకోవాల్సి ఉంది.