- కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయింపులు
- బీఆర్‌ఎస్ తీరు గురివిందను తలపిస్తోంది
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ట్వీట్
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన వారిని కాంగ్రెస్‌లోకి.. చేతి గుర్తుపై గెలిచిన వారిని గులాబీ పార్టీలోకి తీసుకుని మంత్రిపదవులు ఇచ్చినపుడు ఎవరు ఎవరితో కలిసినట్లో కేటీఆర్ చెప్పగలరా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీపై అసత్య ఆరోపణ లు చేస్తూ గురివింద గింజ తరహాలో బీఆర్‌ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఈమేర కు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
మేం గిల్లినట్లు చేస్తాం... మీరు ఏడ్చినట్లు చేయండన్న తెరచాటు ఒప్పందంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అనుసరిం చిన మోసపూరిత విధానాలనే ఇవాళ కాంగ్రె స్ కాపీ కొడుతోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ మొదలు బీఆర్‌ఎస్ ప్రభుత్వదంలో జరిగిన స్కాంలు, కేసుల విషయంలో పురోగతి లేకపోవడం చూస్తే ఎవరి తో ఎవరు కలిసున్నారో చెబుతోందన్నారు.
రైతులను మోసం చేయడంలో, నిరుద్యోగ యువతను నడిరోడ్డుపై నిలబెట్టడంలో, ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడంలో, హిందూ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చడంలో, కుటుంబ పాలనను ప్రోత్సహించ డంలో.. అవినీతిని పెంచి పోషించడంలో.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల ఆలోచన, పరిపాలనలో సారూప్యతను చూస్తే ఎవరు, ఎవరి చేతుల్లో ఉన్నారో అర్థం అవుతోందని అన్నారు.
ఎవరు సంగీతం వాయిస్తే..ఎవరు డాన్స్ చేస్తున్నారో ప్రజలకు ఈపాటికే అర్థమైపోయిందని చెప్పారు. బీజేపీ సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన పార్టీ అయితే... కుటుంబపాలన, అవినీతి వంటివి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సిద్ధాంతాలని అన్నారు. అందుకే ఎవరికి ఎవరు దోస్తులనేది తెలంగాణ సమాజానికి తెలిసిపోయిందని పేర్కొన్నారు.