సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ కుమ్మక్కై దోషులను దాచిపెడుతున్నారా
ఫామ్ హౌస్ సిసి ఫుటేజ్ లను బయటపెట్టాలి
రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా
డ్రగ్స్ ను నిర్మూలిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు నిజం చెప్పాలి
గజ్వేల్ (విజయక్రాంతి): జన్వాడలోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ వినియోగించిన కేసులో నిజమైన దోషులను బయట పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి, డిజిపి లను మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన గజ్వేల్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా గజ్వేల్ లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం పెరిగిందన్నారు. హైదరాబాద్ శివారులో వారాంతపు రోజుల్లో జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో రావులు, రాజులు రేవ్ పార్టీలు జరుపుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను నిర్మూలిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ లో అసలైన దోషుల వివరాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
డ్రగ్స్ వినియోగించే వారిపై దాడులు చేస్తూ, తెల్లవారితే అసలైన దోషులను విడిచిపెడుతున్నారని, అర్ధరాత్రి 12 గంటల సమయంలోనే పట్టుకున్న వారి వివరాలు మీడియాకు వెల్లడించాలని డిజిపికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు డ్రగ్స్ రహిత తెలంగాణా చేస్తామని ప్రకటిస్తుందని, మరో వైపు విచ్చల విడిగా డ్రగ్స్ దందా జరుగుతుందన్నారు. శనివారం రాత్రి హైదారాబాద్ శివార్లలో భాగా ఫెమాస్ అయిన ఫాం హౌస్ లో అర్ధ రాత్రి రేవ్ పార్టీ జరుగుతుందని, వీఐపీల పిల్లలు ఉన్నారని అనేక రకాల వార్తలు వచ్చాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాం హౌస్ ఒనర్ తో కుమ్మక్కు కాకపోతే డిజిపి ఆ ఫాం హౌస్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ ను వెంటనే రిలీస్ చేయాలన్నారు. రేవంత్ రెడ్డి పొల్యూట్ కాకపోతే జన్వాడ ఫాం హౌస్ లో నిన్న రాత్రి ఎం జరిగిందో ప్రజలకు తెలియజేయాలన్నారు.