calender_icon.png 19 September, 2024 | 9:36 PM

బ్లాస్టింగ్ వెనుక హస్తం ఎవరిది?

19-09-2024 01:31:36 AM

  1. శనిగకుంట నీరు ఖాళీ చేసేందుకు ప్రయత్నం
  2. రెవెన్యూ రికార్డులే లేవంటున్న అధికారులు
  3. మత్తడి పేల్చివేతకు బ్లాస్టింగ్ సామాగ్రి ఎక్కడిది?

మంచిర్యాల, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలోని శనిగకుంటపై అక్రమార్కులు కన్నేశారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ పెద్ద చెరువును ఆక్రమించేందుకు ఏకంగా కాంక్రీటుతో నిర్మించిన మత్తడిని పేల్చేందుకు పూనుకున్నారు. చెరువులో నీరంతా బయటకు వెళ్లిపోతే ఎంచక్క చెరువులో మట్టిని నింపుకుంటూ కబ్జా చేయవచ్చనే దురాశతో ఈ తతంగానికి అక్రమార్కులు పాల్పడినట్టు విశ్వసనీయ సమాచారం.

ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెరువులను కాపాడాలనే లక్ష్యంతో హైడ్రా పేరిట ఆక్రమణలను కూల్చివేస్తుంటే.. ఇక్కడేమో బాంబులను ఉపయోగించి చెరువు ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసుస్టేషన్‌కు మూడు కిలో మీటర్ల దూరంలోనే జరుగడం గమనార్హం.

మందుగుండు సామగ్రి ఎక్కడిది?

చెరువు మత్తడి బ్లాస్టింగ్‌కు దుండగులు ఉపయోగించిన మందుగుండు సామగ్రి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా వారి వద్ద ఎంత ఉంది? ఇంకేమైనా దుశ్చర్యలకు పాల్పడుతారా? అని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మత్తడి పేల్చడానికేనా? ఇంకేమైనా అసాంఘిక కార్యకలాపాలకు ఈ ముఠా పాల్పడుతుందా? అనే భయాందోళన నెలకొన్నది. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న శనిగకుంట చెరువు మత్తడి 44 మీటర్లు ఉండగా 39 మీటర్ల మేర జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్ల సహాయంతో పేల్చారు. మత్తడికి ఒక్కో మీటరుకు ఒక్క హోల్ చేసి, ఇలా 40 వరకు జిలిటిన్ స్టిక్స్ పెట్టి, పేల్చడానికి విద్యుత్తు కోసం జనరేటర్‌ను సైతం ఉపయోగించినట్టు సంబంధిత శాఖ అధికారు లు పేర్కొన్నారు. చెరువు వద్ద మత్తడిని పేల్చేందుకు ఎంత మంది పాల్గొన్నారో అంతుచిక్కట్లేదు.

మరమ్మతు పనుల్లో అధికారులు 

జిల్లా ఇరిగేషన్ అధికారి శ్రావణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఈఈ విష్ణు ప్రసాద్ సమక్షంలో డీఈ గోపాల్, ఏఈ తిరుపతి బుధవారం మత్తడి మరమ్మతు పనులు చేయించారు. ఇసుక సంచులతో పాత మత్తడిని బలోపేతం చేస్తున్నారు. ఈ చర్యలతో నీరు నిలిచి కొంత మంది రైతులకైనా మేలు జరుగుతుందని అధికారులు ‘విజయక్రాంతి’తో తెలిపారు. మరోవైపు ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో చెన్నూర్ సీఐ రవీందర్ శనిగకుంట చెరువు మత్తడిని పేల్చిన అనుమానితులను కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు సమాచారం. 

చెరువులో నీరు ఖాళీ అయితే ఎవరికి లాభం? 

శనిగకుంట చెరువు 348, 365 సర్వే నంబర్లలో సుమారు 39 ఎకరాల విస్తీర్ణం లో ఉంది. దీని శిఖం 33.22 ఎకరాలుండగా ఎఫ్‌టీఎల్ 42 ఎకరాలు. చెరువులో నీటి నిలువ సామర్థ్యం 9.45 మిలియన్ క్యూబిక్ ఫీట్ (ఎంసీఎఫ్‌టీ)లు కాగా బఫ ర్ జోన్ కలుపుకొని సుమారు 60 ఎకరా ల విస్తీర్ణంలో ఉంది. మత్తడి మూడు మీ టర్ల ఎత్తు ఉండగా పేల్చడం మూలంగా ఇప్పటికే చెరువులో నుంచి 40 శాతం మేర నీరు వృథాగా పోయింది. దీనితో ఈ చెరువుపై ఆధారపడి 43 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులకు నష్టం వాటిల్లుతుండగా చెరువులో చేప పిల్లలు వేసిన మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పుడు అధికారంలో ఉన్న నాయకుల అండదండలతో గత ఏడాది చెరువు,

బఫర్‌జోన్‌లో ఒక నాయకుడు 4 వేల ట్రిప్పు ల మొరం నింపి చెరువు కబ్జాకు పాల్పడ్డాడు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు మొరం నింపిన స్థలం చుట్టూ చేరింది. మరోవర్షం పడితే నింపిన మట్టి మునుగుతుందనే ఉద్దేశంతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పట్టణంలో చర్చ జరుగుతోంది. గతంలో ఆ నాయకుడ బీఆర్‌ఎస్   లో ఉండి చక్రం తిప్పగా, ప్రస్తుతం అధికార పార్టీకి మారినట్టు తెలిసింది. అధికా ర పార్టీలో ఉంటూ ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడితే.. ఎవరు తన జోలికి రారని, వినాయక నిమజ్జనాన్ని ముహూర్తంగా ఎంచుకొని ఈ చర్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఇలాంటి వైట్ కాలర్ నాయకుల చేతిలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు మాయమవుతున్న చర్యలు శూన్యమేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

రెవెన్యూ రికార్డులే లేవంటా?

చెన్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో చెన్నూర్ పట్టణానికి సంబంధించి ఎలా ంటి మ్యాప్‌లు, రికార్డులు లేవంటా! ఇది స్వయంగా తహసీల్దార్ ఈర్ల మల్లికార్జున్ చెప్పిన విషయం. తాను ఇక్కడికి వచ్చి ఏ డాది కావస్తుందని, మొదట్లోనే ఈ విష యం అడిగానని, గత కొన్ని సంవత్సరాలుగా భూ సర్వే నంబర్లతో కూడిన రెవె న్యూ మ్యాపులు, రికార్డులు, నక్షలు లేవని తెలిపారు. సర్వే అధికారులను సైతం ఫో న్‌లో సంప్రదించగా ఇదే సమాధానం రావడం కొసమెరుపు. అసలు చెన్నూర్‌లో చెరువుల సర్వే నంబర్లు, చుట్టూ సాగు భూముల వివరాలు, సర్వే నంబర్లు లేకుం డా ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు? ఇది కబ్జాదారులకు వరంగా మారడం వల్లనే ఎక్కడెక్కడి సర్వే నంబర్ భూ పట్టా పాసుబుక్కులతో చెరువులను కబ్జాచేస్తున్నారా? అనే అనుమానాలు త లెత్తుతున్నాయి. మాయమైన రెవెన్యూ మ్యా ప్‌లు, రికార్డులపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.