calender_icon.png 3 April, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్కారు భూమేగా అడిగేదెవరు?

03-04-2025 12:05:50 AM

  • రెండెకరాల భూమి కాజేసే యత్నం
  • అర ఎకరం ఆక్రమించినట్టు గుర్తించాం : రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
  • అర్థ ఎకరాలో ఎన్క్రోచ్ అయినట్లు గుర్తించాం: నర్సింగ్, ఆర్‌ఐ, అర్బన్ తాహసీల్దార్ కార్యాలయం 

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి) : పట్టణ కేంద్రాల్లో భూములకు ఉన్న డిమాండే వేరు. గజం గజంకు వేలాది రూపాయల ఖర్చు ఉంటుంది. ఇక్కడే ప్రభుత్వ భూములపై ప్రైవేటు వ్యక్తుల కన్ను పడుతుంది. పట్టా భూముల పక్కన ప్రభుత్వ భూమి ఉంటే చాలు అది కాపాడడం చాలా కష్టతరంగా మారుతుంది. రాత్రి పగలు ఆ ప్రభుత్వ భూముల్లో సీసీ కెమెరాలు పెట్టి పక్కగా నిఘా ఉంచవలసిన అవసరం వస్తుంది.

ఇందుకు ప్రత్యేక కారణాలు లేకపోలేదు. కబ్జాదారుల కన్ను ప్రభుత్వములపైనే పడుతుంది. ఇది ఇప్పటిది కాదు నాటి నుంచి వస్తున్న ఆచారం గా మారుతుంది. నియంత్రించవలసిన అధికారులు అటువైపు వెళ్లిన కొన్ని మాటలు మనకెందుకులే అంటూ వెను తిరుగుతున్న దాఖలాలు కూ డా లేకపోలేదు.

పత్రికల్లో వస్తేనో ఎవరైనా సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేసేను అధికారులు అటువైపు దృష్టి సారిస్తుండ్రు. ఎవ్వ రు ఏమి నోరు మెదపకుంటే అధికారులు అటువైపే చూడరనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. 

-జరిగింది ఇదే....

మహబూబ్ నగర్ పట్టణంలో ఏనుగొండ సమీపంలోని  మౌలాలి గుట్ట దగ్గర గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించింది. సర్వేనెంబర్ 380/9 రఘునందన్ గౌడ్ అనే వ్యక్తికి రెండు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలోను డబుల్ బెడ్ రూమ్ లో నిర్మించారు. అతని భూమిలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ను నిర్మించి నందుకుగాను అతనికి పక్కనే మరో రెండు ఎకరాల భూమిని కేటాయించెందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఈ వ్యక్తికి గతంలోనే పక్కనే ఉన్న సర్వే నెంబర్ 380/1 లో రెండు ఎకరాల భూమి ఇచ్చి ఎన్వోసీ కూడా ఇచ్చారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా రెండెకరాల భూమితో పాటు అదనంగా మరో అర్ధ ఎకరా గుట్ట భూములో మట్టిని చదును చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ సర్వే నెంబర్లు అతని కేటాయించిన భూమిని సం బంధిత రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా సర్వే నిర్వహించి హద్దులు కేటాయించారు. 

-గుట్ట మట్టి ఇతర ప్రాంతాలకు...

మౌలాలి గుట్ట దగ్గర నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పక్కనే ఉన్నా ఓ గుట్ట నుంచి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. బుధవారం మట్టిని తరలింపుకు ఏర్పాటు చేసుకున్న హిటాచిని ఆర్‌ఐ నర్సింగ్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. మైనింగ్ శాఖ ఏన్ఫోర్స్మెంట్ అధికారుల సైతం ఈ గుట్టను ప్రత్యేకంగా పరిశీ లించారు. మట్టిని ఎంత మేరకు తరలించడం జరిగిందో అంచనాలు వేస్తామని వా రు పేర్కొన్నారు. 

- అర్థ ఎకరా ఎన్క్రోచ్ చేసినట్లు గుర్తించాం...

మౌలాలిగుట్ట దగ్గర సర్వే నెంబర్ 380/1 లో రఘునందన్ గౌడ్ అనే వ్యక్తిపై రెండు ఎకరాల భూమి ఉంది. పక్కనే గుట్ట ఉండటంతో మరో అర్థ ఎకరా ఎన్క్రోచ్ చేసినట్లు గుర్తించాం. వారికి కేటాయించిన రెండు ఎకరాల భూమి హద్దులు నిర్ణయించడం జరిగిం ది. గుట్ట దగ్గర మట్టిని తరలింపుకు వచ్చిన హిటాచిని సీజ్ చేశాం. పూర్తి సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో అందజేయడం జరుగుతుంది. 

నర్సింగ్, ఆర్‌ఐ, అర్బన్ తాహసీల్దార్ కార్యాలయం, మహబూబ్ నగర్