calender_icon.png 1 April, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమాత్యయోగం ఎవరికో?

27-03-2025 01:24:13 AM

  • ఇందూరు కాంగ్రెస్‌లో నాలుగు స్తంభాలాట 
  • సీనియర్లు జూనియర్ల మధ్య పోటీ
  • ఆచితూచి అధిష్ఠానం అడుగులు

నిజామాబాద్, మార్చి 26 (విజయ క్రాం తి): నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పెద్ద సారు లేక పాలన అస్తవ్యస్తంగా మారింది. ఉన్న ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే స్థాయికి పరిమితం కావడంతో జిల్లా అధికారులు వారి మాటలను ప్రజా ఉపయోగ పనుల సిఫారసులను పడచెవిన పెడుతున్నారు. ఫలితంగా జిల్లాలో పరిపాలన గాడి తప్పుతోంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సుస్థిరత  సాధించాలంటే మంత్రి పదవి లభిస్తే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకుంటుంది.

ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి కేటాయించాలన్న ఆలో ఆలోచనతో  ఉన్న అధిష్టానానికి జిల్లాలో మంత్రి పదవికి ఎవరు అర్హులనే సమాలోచనలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఉంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచనలతో ఉన్న అధిష్టానానికి  మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేల తాకిడి తగులుతోంది.

మంత్రి పదవిని ఆశించే  వారిలో సీనియర్ గా ఉన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తోపాటు  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే  మదన్ మోహన్ రావు. జూకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రివర్గ విస్తరణకు కసరత్తులు పూర్తిచేసినప్పటికీ అధిష్టానం అనుమతి కొరకు ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణకు హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ పై ఆచితూచి అడుగులేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సామాజిక వర్గాల సమీకరణ కే తగిన ప్రాధాన్యత ఇచ్చింది.  ఇదిలా ఉండగా మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో అని రేసులో ఉన్న ఎమ్మెల్యేలకు వారి అనుచరుల ఉత్కంఠత నెలకొంది. 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి మంత్రి పదవి పొందిన ఎమ్మెల్యేలు మినహాయించి మిగతా వారిని ఇతర కీలక పదవులు కట్టబెట్టి బుజ్జగించాలనే ఆలోచనతో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.  సీనియర్ నాయకులు గతంలో తీవ్ర నిర్బంధాన్ని బిఆర్‌ఎస్ దాడులను ఎదుర్కొని నిలబడి గెలిచిన ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ జాతీయ యువనేత రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేసినట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

సామాజిక సమీకరణ లెక్కల ప్రకారం జిల్లాలో మంత్రి పదవి రేసులో బెరిజు వేస్తే  సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మధ్యలో తీవ్ర ఉత్కంఠత నెలకొని ఉంది. గతంలో జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీనీ ఇచ్చారు ఆ ఎన్నికల్లో సమీప బి ఆర్ ఎస్ అభ్యర్థి బీబీ  పాటిల్ కు గట్టి పోటీ నీ ఇచ్చరు స్వల్ప ఓట్ల తేడాతో అప్పటి ఎంపి స్థానం కాంగ్రెస్ చేజారింది.

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీ బిఆర్‌ఎస్ ను ఎదురించి పోరాడి న లిస్టులో ఉన్న మదన్మోహన్ రావు తన ప్రయత్నాన్ని ఢిల్లీ నుంచి మొదలుపెట్టారు.  మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నల్గొండ మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి కుటుంబం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం సమీప బంధువులు గా ఉన్నారు. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ హోంమంత్రి జానారెడ్డి సమక్షంలో సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి విషయమై చర్చ జరిగినట్టు విశ్వాసనీయ సమాచారం. మరోవైపు ఎవడు పదులకు పైగా వయసున్న ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే పరిస్థితి ఏంటి అన్న విషయంపై మల్లా గుల్లలు మొదలయ్యాయి. నేపద్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మరింత ఉత్సాహంతో తన ప్రయత్నాలకు పదును పెట్టా రు. 

మరోవైపు దళిత సామాజిక కోణంలో నుండి లక్ష్మీకాంతరావు తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాక వెంకటస్వామి వారసుడు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అదే సామాజిక వర్గం నుంచి ఉండడంతో దాదాపుగా లక్ష్మీకాంతరావు లిస్టులో నుంచి తొలగినట్టే అన్న సమాచారం అందుతోంది.

మరోవైపు బీఆర్‌ఎస్ కంచుకోట అయిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పలుదపాలుగా పోటీ చేసి అప్పటి బి.ఆర్.ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు గట్టి పోటీ ఇచ్చి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అతని ఓటమిపాలు చేసి గెలుపొందిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తన లాబీతో ప్రయత్నాలు మొదలు పెట్టారని విశ్వాసనీయ సమాచారం. 

మేరకు జాతీయస్థాయి వైద్యుల సంఘం ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసి ముఖ్యమంత్రితో సాంప్రదింపులు జరిపి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీపై తమ సంఘం చే ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో చిన్నాచితక డిగ్రీలతో డాక్టర్లు గా ఉన్న మంత్రి పదవులు చేపట్టిన ఎమ్మెల్యేలకు దీటుగా వృత్తిపరంగా ఆర్థోపెడిక్ డాక్టర్ గా ఉన్న భూపతిరెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా  రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పై డాక్టర్ల లాబీ ఒత్తిడి తేవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞాపన ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది.

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి ముఖ్యమంత్రి సైతం సుముఖంగా ఉన్నప్పటికీ కుల గణన తెర మీదికి రావడంతో ఈ మధ్యనే బీసీ నినాదం పొందుకోవడం తో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సముచిత ప్రాధా న్యం కల్పించి న్యాయం చేసి ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు దూరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యతతో వ్యవహరించాలనే సంకల్పంతో అధిష్టానం  ఉంది.

సామాజిక సమతుల్యం కారణంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి విషయం కఠినంగా మారింది. బీసీ వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవిలో స్థానం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించి నట్టుగా సమాచారం. గతంలో నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రులుగా ఉన్న వారు పలు దఫాల వారీగా వారీగా జిల్లా అభివృద్ధిపై సమీక్షలు జరిపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది.

మంత్రివర్గంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలని గట్టి సంకల్పంతో ఉన్న అధిష్టానానికి ఉన్నప్పటికీని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్థానికుడై న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తుది నిర్ణయం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం మెర కే మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠత నెలకొంది. ఏది ఏమైనప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ కావడంతో ఆయన అభిప్రా యానికి పూర్తి ప్రాధాన్యత హై కమాండ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  

మంత్రి పదవి రేసులో ఉండి పాటుపడుతున్న ఎమ్మెల్యేలు ఎవరు మహేష్ కుమార్ గౌడ్ ని ప్రసన్నం చేసుకుంటారు అన్న ఆలోచన జిల్లా కాంగ్రెస్ క్యాడర్లో నెలకొంది. గతంలో జిల్లాలో మంత్రులుగా క్యాబినెట్ స్థాయిలో బాలా గౌడ్  అర్గుల్ రాజారాం బషీరుద్దీన్ బాబు ఖాన్ డి.సత్యనారాయణ పోచారం శ్రీనివాస్ రెడ్డి డి శ్రీనివాస్ షబ్బీర్ అలీ తదితరులు మంత్రి పదవిని చేపట్టగా ఏఆర్ సురేష్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డిలు స్పీకర్ పదవులు చేపట్టారు.

హలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికి ని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల కు  మంత్రి పదవులు వరిస్తూ నే ఉన్నాయి. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాకు ఈసారి క్యాబినెట్ ప్రాతినిధ్యం ఇవ్వాలని అప్పుడు గాని జిల్లాలో పార్టీ ప్రతిష్ట జిల్లా పరిపాలన గాడిలో పడుతోందన్న అభిప్రాయంతో కాంగ్రెస్ శ్రేణులు జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.