calender_icon.png 15 November, 2024 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందెవరు?

12-11-2024 01:09:39 AM

కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది 

ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి

జనగామ(వరంగల్), నవంబర్ ౧౧ (విజ యక్రాంతి): బంగారు తెలంగాణను నిర్మిస్తామని చెప్పి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందెవరని ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకట్ నారాయణ ప్రశ్నించారు. బీసీ సామాజిక వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం అవకాశాలు కల్పించాలని మాజీ మం త్రి కేటీఆర్ డిమాండ్ చేయడం హాస్యాస్పదని ఎద్దేవా చేశారు. సోమవారం వరంగల్‌లోని తన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధికారంలోకి రాగానే ఆర్భాటంగా తెలంగాణ కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించి ఆ గణాంకాలను కేవలం కుటుంబ ఆధిపత్య రాజకీయాల కోసం వాడుకుని బీసీ, ఎస్సీ, ఎస్టీలను నట్టేట ముంచారని విమర్శించారు. స్థానిక సంస్థల లో బీసీలకు ఉన్న 33 శాతం రిజర్వేషన్లను 22 శాతానికి ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావానికి, ఎదుగుదలకు కృషిచేసి పత్రికను, మీడియాను పెంచి పోషించి.. స్వరాష్ట్రం సిద్ధించాక పార్టీని తమ సొంత ఆస్తిగా మార్చుకున్నారని విమ ర్శించారు.

ప్రశ్నించిన ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారన్నారు. అధికారం కోల్పోయాక బీసీల భజన చేయడం సిగ్గుచేటని మండి పడ్డారు. ప్రశ్నించిన జర్నలిస్టులను నిర్బం ధించి చిత్రహింసలకు గురి చేసింది వారి కుటుంబ పాలనే అని విమర్శించారు. తొమ్మిదిన్నర ఏండ్ల పాటు బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా తీవ్ర అన్యాయానికి గురిచేశా రన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు న్యాయం చేయక పోతే ప్రజలు తప్పకుండా అందుకు తగినట్లు స్పందిస్తారని కూరపాటి హెచ్చరించారు.

సమావేశంలో బీసీ న్యాయ వాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాల సుధాకర్, లీగల్ సెల్, ఆర్‌టీఐ వైస్ చైర్మన్ గునిగంటి శ్రీనివాస్‌గౌడ్, వరంగల్ ఉమ్మడి జిల్లా న్యాయవాదుల కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ చెన్నూరి రమేష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బగ్గిరాజు పాల్గొన్నారు.