- మంత్రివర్గ విస్తరణలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చోటు దక్కుతుందా.. లేదా..!
-
- ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డి. బీసీ, దళిత ఎమ్మెల్యేలు
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) ః మంత్రివర్గ విస్తరణ స్థానిక ఎన్నికల షెడ్యూల్ లోపే జరుగుతుందని అధికార పార్టీలో జరుగుతున్న ఊహాగానాల నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో మంత్రి పదవులు ఆవిశిస్తున్న వారి ఆశలు చిగురిస్తు న్నాయి. గురువారం నాడు సీఎల్పీ సమా వేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్చార్జి దీపదాస్ మున్సి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ కు మారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడు ఢిల్లీకి వెళ్లారు.
పార్టీ అధ్యక్షులు కార్గే, రాహుల్ గాంధీ లతో జరిగే సమా వేశంలో మంత్రివర్గ విస్తరణ పై ఒక నిర్ణయానికి రావచ్చని పార్టీ వర్గాల భావిస్తున్నాయి. చాలా కాలంగా క్యాబినెట్ విస్తరణ పలు వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు నిరాషాని స్పృహల కు గురవుతున్నారు.
ఇటీవల పదిమంది ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం కావడంతో పార్టీలో వేడి పుట్టి కలకలం రేపింది. జిల్లాల వారీగా ఆశావాహుల జాబితా ను దీపా దాస్ మున్సీ తయా రు చేయడంతో ఈసారి రాహుల్ గాంధీ సమక్షం లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఆశా వాహులు ఆశిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే సీనియర్ నాయకులు కోమ టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో బెర్త్ కోసం మొదటినుండి ఎదురుచూస్తున్నారు.
ఆయన సోదరుడు నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి వర్గంలో కొనసాగుతున్న నేపథ్యంలో రజకుపాల్ రెడ్డికి స్థానం దక్కలేదు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి వెంకటరెడ్డి కొనసాగుతున్న కారణంగా రాజగోపాల్ రెడ్డికి ఈ విస్తరణలో కూడా చోటు దక్కేది అనుమానంగానే ఉంది.
అధిష్టానం ఆశీస్సులు మాత్రం రాజగోపాల్ రెడ్డికి ఉన్నట్లుగా తెలుస్తోంది. దళిత సామాజిక వర్గాల ఎమ్మెల్యేలకు జిల్లా నుండి అవకాశం కల్పించాలి అని పార్టీ భావిస్తే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్, నకరేకల్ ఎమ్మెల్యే వీరేశములు ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి అవకా శం ఇవ్వాలని భావిస్తే ప్రస్తుతం ప్రభుత్వ విప్పుగా కొనసాగుతున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు చోటు దక్కి అవకాశాలు న్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ, బీసీ కులగణన సమస్య లు ప్రభుత్వాన్ని పీడిస్తున్నాయి రెండు సామాజిక వర్గాలకు పార్టీ పరంగా మంత్రి వర్గంలో స్థానం కల్పించి, ఓట్లను తమ ఖాతాలో వేసుకొని స్థానిక ఎన్నికల్లో విజ యడంకా మోగించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.