calender_icon.png 28 December, 2024 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా గొంతు నొక్కే హక్కు మీకెవరిచ్చారు?

21-12-2024 03:00:46 AM

  • * 'ధరణి’ వల్లే బీఆర్‌ఎస్ నాశనం
  • * ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): “అసెంబ్లీలో తమ గొంతు నొక్కే హక్కు మీకెవరిచ్చారు?” అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీలో భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా సభలో బీఆర్‌ఎస్ నేతలు కాగితాలు విసిరేసి నానా హంగామా చేసిన తీరుపై ఆయన మండిపడ్డారు. ధరణి పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూమాతను బంధించిం దని ఆరోపించారు. భూమాత సంకెళ్లు తెంచేందుకు తెస్తున్న కొత్త బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు అడ్డుకోవడం తగదన్నారు. ఆ పార్టీ ఒక్కటే తెలంగాణ కోసం పోరాడినట్టు ప్రచారం చే సుకోవడం సరికాదన్నారు. తాను కూడా తెలంగాణ కోసం దీక్ష చేపట్టినట్టు కూనంనేని గుర్తు చేశారు. తెలంగాణను బీఆర్‌ఎస్ మాత్రమే పాలించాలా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ను ధరణే నాశనం చేసిందన్నారు. గ్రామాల్లో ఆ పార్టీ ఓటమికి ఇది కూడా ఒక కారణమని చెప్పారు. అలాగే, చట్టంలో తేవాల్సిన మార్పులపై ప్రభుత్వానికి కూనంనేని కొన్ని సూచనలు చేసారు.