కె. రామకృష్ణ :
ఒక రాష్ట్రంలో రెండు తెగల మధ్య అంతర్యుద్ధం ఏడాదికి పైగా కొననసాగడం ఏడు దశాబ్దాలు దాటిన స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడా చూసి ఉండం. మణిపూర్ సమస్య పరిష్కారానికి కేంద్రప్రభుత్వం సీరియస్‌గా ఎలాంటి ప్రయత్నమూ చేయకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. మణిపూర్‌లో జాతు ల మధ్య అల్లర్లు మొదలయి ఇప్పటికి 17 నెలలు గడిచిపోయాయి. గత ఏడాది మేలో మొదలైన ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 250 మందికి పైగా మృతిచెందారు. వందలాది మంది మహిళలపై లైంగిక దాడులు జరిగాయి. 60 వేల మందికి పైగా నిరా శ్రయులుగామారి సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పలు చర్చిలకు నిప్పు పెట్టారు.
రాష్ట్రంలో ప్రజలు బతికినా, చచ్చినా కేంద్రానికి ఏ మాత్రం పట్టదేమోననే అభిప్రాయం రాష్ట్రప్రజల్లో కలిగేలా పరిస్థితి ఉంది. ఈశాన్య భారతంలో ఓ మారుమూల ప్రాంతంగా రాష్ట్రంఉన్న కారణంగా అక్కడ ఎంత తీవ్ర స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా ఏమీ జరగలేదనే మిగతా దేశ ప్రజలు అనుకునే పరిస్థితి. ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం చేసి నగ్నంగా ఊరేగించినప్పుడు మాత్రమే దేశ ప్రజల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది.
రాష్ట్రంలో ఇంటర్‌నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుండడంతో సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత మాత్రమే దానికి సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అల్లర్లు ప్రారంభమైన రోజుల్లో పోలీసులు చూస్తూ ఉండగానే పోలీసు ఆయుధాగారాలనుంచి ఆయుధాలు దోచుకెళ్లారు. అల్లర్లకు పాల్పడుతున్న ఇరుపక్షాలు కూడా ఆయుధాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి.
బీజేపీ సర్కార్ ఉండడమే కారణమా?
రాష్ట్రాన్ని భాkతీయ జనతా పార్టీ పాలిస్తోంది. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్‌ను పదవినుంచి ఎందుకు తప్పించలేదనడానికి అదొక్కటే కారణం క నిపిస్తోంది.మైనారిటీ కుకీజో తెగ క్రైస్తవులు, మెజారిటీ మీsw తెగవారు పరస్ప రం ప్రతీకార దాడులకు దిగడంతో మొదలైన ఈ హింసాకాండలో ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ పక్షపాత పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యా తీసుకో కపోవడం గమనార్హం. రాష్ట్రంలో జాతుల మధ్య విభేదాలు చాలా కాలంగా ఉన్నా యి. కానీ చాలా దశాబ్దాల తర్వాత రాష్ట్రం లో ఇంత తీవ్రస్థాయిలో అవి ఎగసిపడడం ఇదే మొదటిసారి.
తీవ్రవాద మీతీ సంస్థ అరంబాయి తెంగోల్‌కు రాష్ట్రప్రభుత్వం త న పంపిణీ ఏజన్సీని ఉద్దేశపూర్వకంగా ఎ లా కట్టబెట్టిందనేది ప్రతి ఒక్కరినీ వేధిస్తు న్న ప్రశ్న. మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండపై ప్రతిపక్షాలు గత ఏడాది ఆగ స్టులో పార్లమెంటులో అవిశ్వాసతీర్మానం ద్వారా ఒత్తిడి తీసుకు రావడంతో ఈ అం శంపై మూడు నెలలుగా మౌనముద్ర వ హించిన ప్రధాని ఎట్టకేలకు పెదవి విప్పా రు. కానీ మణిపూర్‌లో సమస్యలకు గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షంపై నెపాన్ని నెట్టివేసి చేతులు దులి పేసుకున్నారే తప్ప సమస్య పరిష్కారనికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదు.
ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ని రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు ఎ న్నికలు జరగడానికి ముందు ఓ స్థానిక ది నపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడుతూ తమ ప్రభుత్వం ‘సకాలంలో ’జోక్యం చేసుకోవడంతో రాష్ట్రంలో పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని చెప్పుకొచ్చారు. అయితే గత ఏప్రిల్ 19 పోలింగ్ రోజున చెలరేగిన హింసాకాండ ప్రధాని మాటల్లో ఏమాత్రం నిజం లేదని నిరూపించాయి. మయన్మార్‌తో రాష్ట్రానికి ఉన్న సరిహద్దులో కంచె నిర్మాణం జరుతామని చెప్పడం తప్ప కేంద్ర ప్రభుత్వం సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మకమైన ప్రతిపాదన ఏదీ చేయలేదనే చెప్పాలి. అయితే కంచె నిర్మాణం అనేది ఒక విధంగా ప్రభుత్వం ఒక విధంగా తన వైఫల్యాన్ని అంగీకరించడమేనని చెప్పాలి.
ప్రధాని ఎందుకు వెళ్లలేదు?
ఓ వైపు రాష్ట్రంలో 16 నెలలుగా హిం సాకాండ కొనసాగుతున్నా, వందల మం ది ప్రాణాలు కోల్పోయినా, వేలాది మంది నిరాశ్రయులగా మారినా ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క సారి కూడా మణిపూర్‌ను సం దర్శించకపోవడం అన్ని వర్గాలనుంచి వి మర్శకు కారణమవుతోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మిగతా ఈశాన్య రాష్ట్రా లతో పాటుగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ మణిపూర్‌లో మాత్రం పర్య టించలేదు. ఈ 16 నెలల కాలంలో ప్రధాని ఎన్నో దేశాల్లో పర్యటించారు కానీ దేశంలో అంతర్భాగమైన మణిపూర్‌ను సందర్శించడానికి ఆయనకు సమయం దొరకలేదా? అన్న ప్రతిపక్షాల విమర్శకు ప్రభుత్వంవద్ద సమాధానం లేదు.
ఈ మొ త్తం సమస్యకు కేంద్రప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడిం ది. అంతేకాదు మణిపూర్‌లో హింసాకాండను అణచివేయడంతో పూర్తిగా విఫలమ యినందుకు హోంమంత్రి అమిత్ షాను తక్షణం పదవినుంచి తొలగించాలని కూ డా ఆ పార్టీ డిమాండ్ చేసింది. మీడియా సమావేశంలో మణిపూర్ కాంగ్రెస్ ఇన్‌చా ర్జి మేఘచంద్ర, ఇన్నర్ మణిపూర్ ఎంపీ బిమల్ అకోయ్‌జమ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి గిరీశ్ చోదంకర్‌తో పాటుగా ఏఐసీసీ అధికార ప్రతినిధి పుప్రియా ష్రినాటే పా ల్గొన్నారు. 16 నెలలు గడిచిపోయినా ఇప్పటికీ రాష్ట్రంలో దహనకాండ, హత్యలు, దోపిడీలు కొనసాగుతూనే ఉన్నాయని వారంతా ఆరోపించారు.
తాజాగా ఈ నెల 1వ తేదీనుంచి మళ్లీ మొదలయిన అల్లర్లలో పది రోజలు వ్యవధిలో 12 మంది చనిపోయారని, ఆర్‌పిజి తుసాకు మోతలు వినిపిస్తూనే ఉన్నాయని, ద్రోన్‌లద్వారా గ్రామాలపై బాంబుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయని వారు ఆరోపించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ మూడు సార్లు మణిపూర్‌లో పర్యటించి రాష్ట్ర ప్రజలను ఓదారిస్తే ప్రధాని ఒక్కసారి కూడా ఎందుకు వెళ్లలేని వారు ప్రశ్నించారు. కేం ద్రం చేతిలో కీలుబొమ్మలాగా వ్యవహరిస్తు న్న ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ ‘కుకీల్యాం డ్’ పేరుతో కొత్త నాటకానికి తెరతీస్తున్నారని వారు మండిపడ్డారు.
తాజాగా మొదలై న అల్లర్లలో మాజీ ముఖ్యమంత్రి నివాసంపై రాకెట్ దాడి జరిగిందని, గవర్నర్ నివాసంపై రాళ్లు విసిరారని పేర్కొన్నారు. భద్రతా దళాలపై దాడులు జరుగుతున్నాయని, వారి ఆయుధాలను లాక్కోవడానికి ప్రయత్నాలు జరిగాయని వారు ఆరోపించారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారని, విద్యార్థులు వీధులకెక్కార ని, అన్ని పరీక్షలను వాయిదా వేయడం జ రిగిందని వారు పేర్కొన్నారు. విద్యార్థులు ఒక విద్యాసంవత్సరం కోల్పయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.
తాజా హింస నేపథ్యంలో ప్రభుత్వం రా ష్ట్రంలో అయిదు రోజుల పాటు ఇంటర్‌నె ట్ సేవలపై నిషేధం విధించిందని, ఇది స మస్యను మరింత జటిలం చేస్తుందని వా రు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కేవలం హింసాకాండ మాత్రమే కాదని, సంస్థాగ త, రాజ్యాంగపరమైన వైఫల్యమని కూడా వారు ఆరోపించారు.రాష్ట్ర ప్రజలకు జీవనాడిగా ఉన్న రెండు జాతీయ రహదారు లు గత 16 నెలలుగా మూతపడే ఉన్నాయ ని, ఫలితంగా ద్రవ్యోల్బణం దేశంలో ఎక్క డా లేనంతగా పెరిగిపోయిందని వారు దుయ్యబట్టారు.
ప్రభుత్వ పక్షపాత ధోరణి
రాష్ట్రప్రభుత్వం మైనారిటీ కుకీ తెగవారి ని నిర్లక్ష్యం చేసి మీతీతెగను ప్రోత్సహిస్తూ ఉందన్న కారణంగా చెలరేగిన హింసాకాండ ఇన్ని నెలలైనా ఆగడం లేదు. ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాన్నీ లోయ ప్రాంతంలోని మీతీ తెగవారికే దక్కుతున్నాయన్నది కుకీల ప్రధాన ఆరోపణ. దీనితో రాష్ట్రం దాదాపుగా రెండుగా విడిపోయిం ది. లోయప్రాంతంలో మీతీల అధిపత్యం కొనసాగుతుండగా కొండప్రాంతాలు కుకీ ల చేతిలో ఉన్నాయి. రెండు తెగల మ ధ్య వివాదాన్ని పరిష్కరించకుండా ప్రభుత్వం దీన్ని శాంతిభద్రతల సమస్యగా చూడడమే ఇంతకాలం హింసాకాండ కొనసాగడానికి ప్రధాన కారణమన్న విమర్శలు ఉన్నాయి.
మయన్మార్‌నుంచి ఆయుధాలు
మణిపూర్‌లో హింసాకాండను రెచ్చగొట్టడానికి మయన్మార్ బంగ్లాదేశ్‌లకు చెంది న ఉగ్రవాదులు మందుగుండు, ఆయుధా లు సరఫరా చేస్తున్నారని గత ఏడాదిలోనే జాతీయ భద్రతా ఏజన్సీ(ఎన్‌ఐఏ) ఆరోపించింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. మణిపూర్ హింసాకాండలో విదేశీ హస్ంత ఉన్నట్లు కేంద్రానికి తెలిసినప్పుడు దాన్ని అదుపు చేయడానికి కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
బీరేంద్ర సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రంలో కొంతకాలం పాటు రాష్ట్రపతి పాలన విధించాలి. పరిపాలనను కేంద్రం నేరుగా తన చేతుల్లోకి తీసుకుని ఓ వైపు అల్లర్లను అణచివేయడానికి చర్యలు తీసుకుంటూనే మనో వైపు హింసకు తెగబడుతున్న ఇరు వర్గాల ప్రజలతో శాంతి చ్చలు జరపాలి. లేకపోతే మణిపేర్ రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంటుంది. మోదీ సర్కార్ వైఫల్యంగా నిలచిపోయే ప్రమాదం ఉంది.