calender_icon.png 8 January, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాకు ఎవరు కావాలంటే..?

31-07-2024 12:36:56 AM

బిగ్‌బీతో సినిమా చేయకుండానే బచ్చన్ భామగా పేరొందింది భాగ్యశ్రీ బోర్సే. దీనికి కారణం హీరో రవితేజ అని చెప్పవచ్చు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న తాజా సినిమాకి ‘మిస్టర్ బచ్చన్’ అని పేరు పెట్టింది ఆయనే మరి. తొలి సినిమా విడుదల కాకముందే తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా అవకాశాలతో పాటు ఇక్కడి వారి అభిమానాన్ని సంపాదించుకుంది ఈ నూతన కథానాయిక. ఇక ఈ మధ్యకాలంలో విడుదలైన ‘సితార్’ సాంగ్‌లో ఆమెను చూసిన నూనుగు మీసాల వారు ఇంకా ఆ నడుమొంపుల్లో నలుగుతూనే ఉన్నారు. అంతలోనే ‘రెప్పల్ డప్పుల్’ పాటతో వారిని రెప్పవేయకుండా చేసిన బోర్సే.. ఇటీవల వేదిక మీద కూడా ఆ పాటకు హుషారుగా స్టెప్పులేసింది.

సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల తొలిసారి తెలుగు మీడియా ముందుకొచ్చిన భాగ్యశ్రీకి “నటిగా అభిమానుల్ని కోరుకుంటున్నారా? లేక ప్రేక్షకులనా?” అనే ప్రశ్న ఎదురైంది. దీనికి గాను “క్లిష్టమైన ప్రశ్నే అంటూ.. ప్రేక్షకులంతా నా అభిమానులు కావాలి. అభిమానులందరూ ప్రేక్షకులు కావాలి” అని బదులిచ్చి శభాష్ అనిపించుకుందీ బ్యూటీ. తెలుగులో వస్తోన్న ఆదరణకు కృతజ్ఞురాలిని అని సవినయంగా చెబుతోన్న బోర్సే.. తొలి సినిమా అయిన ‘మిస్టర్ బచ్చన్’కి తానే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.