calender_icon.png 19 March, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య చేసింది ఎవరు?

17-03-2025 01:59:06 AM

కరీంనగర్ క్రైమ్ ,మార్చి16(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కొత్తపెళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎస్సారెస్పీ కెనాల్ కొత్తపల్లి దేశరాజు పల్లి వెళ్లే దారిలో ఒక గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం పడి ఉందని గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు మండల రెవెన్యూ అధికారి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా రక్తం మడుగులో పడి ఉన్న ఒక వృద్ధ మహిళను గుర్తించినట్లు ఆయన పోలీసులకు సమాచారం అందియ్యగా రంగంలోకి  ట్రేని ఐపీఎస్ వసుంధర రూరల్   ఏ సి పి  శుభం ప్రకాష్ నేతృత్వంలో అక్కడికి చేరుకున్న రూరల్ సిఐ ప్రదీప్ హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు .

ఇందులో భాగంగా మృతురాలు వద్ద లభించిన ఆధారాలతో ఆమె నుస్తులాపూర్ కు చెందిన తనకు వెంకటమ్మ 70 గా గుర్తించారు అయితే ఈ ఘాతకానికి పాల్పడింది కుటుంబ సభ్యుల ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు హత్య జరిగిన తీరు గమనించి బలవంతంగా గొంతు కోసి చంపిన ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం   అయితే ఆస్తికోసం చేసిన హత్య గా పరిగణలోకి తీసుకొని కుటుంబ సభ్యులను విచారించే పనిలో పడ్డారు  పోలీసులు