calender_icon.png 2 April, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల కార్మికులను పట్టించుకునేది ఎవరు..?

31-03-2025 08:20:53 PM

చట్టాలు ఎన్ని ఉన్నా అమలుకు నోచుకోని వైనం...

జుక్కల్ (విజయక్రాంతి): బాల కార్మికులకు చదువు నేర్పించాలని ఎన్నో చట్టాలు ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు. బడి బాట పట్టాల్సిన బాల కార్మికులను అధికారులు పట్టించుకోకపోవడంతో రోడ్లపై తిరుగుతున్నారు. బాల కార్మికులపై అధికారుల నిఘా కొరవడిందని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులు చదువుకోవాల్సిన వయసులో ఇతర పనులు చేసుకుంటున్నారు. నియంత్రించాల్సిన వారు నిమ్మకు నీరేత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అనునిత్యం రోడ్డు సైడ్ కు ఎందరో బాల కార్మికులు కనిపిస్తూనే ఉన్నప్పటికీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జుక్కల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో బాల కార్మికులు అధికంగా కనిపిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. రోడ్డు సైడ్ కు చెత్త ఏరుకునే బాల కార్మికులకు కారులో వెళ్లే అధికారులు కనీసం ఎవరు..? ఏమిటి..? ఎందుకు..? అనే విషయాలు కూడా పిల్లలకు అడగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. చాలామంది వెనుకబడిన ప్రాంతమైనందున కూలి పనులకు పశువుల కాపలకు తమ పిల్లలను తీసుకువెళుతున్నారు. వారికి కనీసం కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితుల్లో కూడా అధికారులు లేరంటేనే వారు ఏ మేరకు తమ విధులను నిర్వహిస్తున్నారని అర్థమవుతుంది. 

అధికారుల వ్యవహారం. ఎవరు ఎటు పోయిన పర్వాలేదు నెల జీతం వస్తుంది కదా అని ధీమలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎండాకాలమైనందున చాలామంది బాల కార్మికులు పోలం పనులకు ఇటుక బట్టీల్లో, హోటలల్లో, కిరాణా షాపుల్లో మగ్గుతూనే ఉన్నారు. అయినా ఎవరు పట్టించుకునే వారు లేరని విమర్శిస్తున్నారు. బాల కార్మికులను చూస్తే జాలి వేస్తుంది కానీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాల కార్మిక వ్యవస్థపై ప్రత్యేకమైన నిఘా కొరవడినట్లు చెబుతున్నారు. వారికి పిల్లలకు పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పాఠశాలలకు పంపే విధంగా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. కనీసం ఎండాకాలంలోనైనా వేసవి సెలవుల్లో ఇలాంటి బాలకార్మికులపై నిఘా పెట్టి వచ్చే ఏడాది నుంచైనా పాఠశాలల్లో చేరే విధంగా సంబంధిత అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

బాల కార్మికులపై మాకు ఎలాంటి గైడెన్స్ లేవు..

తిరుపతయ్య, మండల విద్యాశాఖ అధికారి, జుక్కల్

బాల కార్మికుల వ్యవస్థపై తమకు ప్రభుత్వం నుంచి గైడెన్స్ రాలేదని ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని తెలిపారు. ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా బాల కార్మికుల కోసం ఎవరిని నియమించలేదు. వేరే శాఖలోనీ అధికారులకు సమాచారం ఉండవచ్చు.