- పెద్దఅంబర్‌పేట మధ్య ఏండ్లు గడుస్తున్నా పూర్తికాని వంతెన పనులు
- పర్యవేక్షించని అధికారులు, ప్రజాప్రతినిధులు
అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 1: పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్‌కోహెడ గ్రామాల మధ్య రెం డేళ్ల నుంచి చాకిరేవు వంతెన నిర్మాణ పను లు సాగుతూనే ఉన్నాయి. ఈ మార్గంలో నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులను హడావుడిగా ప్రారం భించారు కానీ పూర్తిచేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. పనులు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా ఉన్నాయని మండిపడుతున్నారు.
పెద్దఅంబర్‌పేట నుంచి దాదాపు ఆరు గ్రామాలకు ఈ రోడ్డే రాచమార్గం. గతంలో వరదలు రావడం.. రోడ్డు దెబ్బతినడంతో వంతెన నిర్మాణ పనులు చేపట్టారు. కానీ ఎంతకీ పూర్తికాకపోవడంతో పాత రోడ్డు ఉన్నా బాగుండేదని.. సగంలో నిలిచిన వంతెన పనులతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. కోహె డ ప్రాంతంలో పలు కార్పొరేట్ సంస్థలకు చెందిన కళాశాలలు ఉన్నాయి. అదే విధంగా సంఘీ టెంపుల్‌కు ఈ మార్గం నుంచే ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తుంటారు.
వంతెన నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్, ప్లానింగ్‌పై చర్చించకుండానే గత మున్సిపల్ పాలక మండలిలో తీర్మానం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిర్మాణ పనుల కోసం ఇప్పటి వరకు ఒక దఫా రూ.4 కోట్లు, రెండో దఫా రూ.3.5 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం. పనులు పూర్తికావడానికి అధికారులు అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రణాళిక లేకుండానే పనులు..
ప్రణాళిక లేకుండానే వంతెన నిర్మాణ పనులు చేపట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వంతెన నిర్మాణ విస్తీర్ణం ఎక్కువ వద్దని చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదని, గతంలో వర్షపు నీరు ఎక్కడి నుంచి వెళ్తు ందో అక్కడి వరకు నిర్మాణ పనులు చేస్తే బాగుండేదని ప్రజలు అంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఒంటెద్దు పోకడ లకు పోయారని విమర్శిస్తున్నారు.