calender_icon.png 13 January, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎన్జీవోస్‌లో ఆ నలుగురు ఎవరు?

13-01-2025 02:05:48 AM

  • గెజిటెడ్ హోదాల్లో ఉండీ నాన్ గెజిటెడ్ సంఘంలో 

రాష్ట్ర నాయకులకు ఫిర్యాదు చేసిన జిల్లా టీఎన్జీవోలు

మంచిర్యాల, జనవరి 12 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీఎన్జీవోస్) లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. కొంత కాలంగా గెజిటెడ్ అధికారులుగా ఉండీ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘంలో కీలక పదవులు అనుభవిస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఓ సాధారణ కార్యవర్గ సభ్యుడు రాష్ట్ర కార్యవర్గానికి ఫిర్యాదు చేశారు.

ఇన్ని రోజులు ‘మేనేజ్’ చేసుకుంటూ వచ్చిన సదరు సంఘం నాయకులకు రాష్ట్ర నాయకులకు ఫిర్యాదు చేయడంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. టీఎన్‌జీ వోస్‌లో ‘ఆ నలుగురు’ గెజిటెడ్ హోదా వచ్చినా టీఎన్‌జీవోస్‌లోనే ఎందుకు ఉంటున్నారని పలువురు యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అసలు గెజిటెడ్ హోదా పొందిన వీరికి నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘంలో స్థానం కల్పించడం ఎందుకని నిలదీస్తున్నారు.

అంతే కాకుండా వారు చేసే జల్సాల ఫొటోలు అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం ఎందుకని, వారు ఉద్యోగుల సమస్యలు ఏం తీర్చారని మండి పడుతున్నారు. గెజిటెడ్ హోదా కలిగిన గడియారం శ్రీహరి, శ్రీపతి బాపురావు, పొన్న మల్లయ్య, రాంమోహన్‌లు నాన్ గెజిటెడ్ సంఘంలో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.