calender_icon.png 28 October, 2024 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాల సంత వారెవ్వా!

30-08-2024 01:40:44 AM

  1. కామారెడ్డిలో 13 ఏళ్లుగా నిర్వహణ 
  2. ప్రతి వారం వేల సంఖ్యలో అమ్మకాలు 
  3. పొరుగు జిల్లాల నుంచి వాహనదారుల రాక 

కామారెడ్డి, ఆగస్టు 29 (విజయక్రాంతి): సంత అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చేది పశువుల సంతనో లేదా కూరగాయల సంతనో కదా. వాహనాలకు ఓ సంత ఉం దన్న విషయం తెలుసా? కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న వాహనాల సంతను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. జిల్లా కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చిగ్రౌండ్‌లో ఓ గల్ప్ కార్మికుడు వాహనా ల సంతను నిర్వహిస్తున్నాడు. గల్ఫ్‌లో నిర్వహించే వాహనాల సంతను చూసిన తర్వాత తమ గ్రామంలో ఎందుకు అలాంటి సంత ఏర్పాటు చేయకూడదని ఆలోచించిన అత డు 13 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశాడు. ప్రతి గురువారం ఒక వైపు పశువుల సంతా, మరోవైపు మేకల సంతా మరోచోట వాహనాల సంతలు కొనసాగుతున్నాయి. 

వాహనాలు కొనాలనుకున్న వారు, అమ్మే వారు నేరుగా ఈ సంతకు వచ్చి తమకు నచ్చిన వా హనాలు ఎంచుకుంటారు. బ్రోకర్ల అవసరం లేకుండా నేరుగా కొనుగోలుదారు/ విక్రయదారే ముఖాముఖీగా మాట్లాడుకుని కొనుగోలు చేస్తుంటారు. ప్రతి వారం ఇక్కడ వం దల సంఖ్యలో వాహనాల అమ్మకాలు జరుగుతుండటం గమ నార్హం. వాహనాల అమ్మకంతో వాహనానికి రూ.500 చొప్పున వ స్తున్నట్టు నిర్వాహకుడు అరీఫ్‌బాబా అలియాస్ అంగడీ బాబా తెలిపారు.

తన సర్వీస్ చూసి చాలా జిల్లాల నుంచి వాహనాలు కొనేందుకు, అమ్మేందుకు కామారెడ్డికి వస్తున్నారని.. దళారి వ్యవస్థ లేదని స్పష్టంచేశారు. వాహనాల అంగడీ నిర్వహిస్తుండటంతో తన పేరు కూడా అంగ డీ బాబాగా మారిపోయిందని చెప్పాడు. రాష్ట్రంలోనే ఇలాంటి వాహనాల అంగడీ మరెక్కడ లేదని తెలిపారు. ప్రతి వారం 500 నుంచి 1000 వాహనాల విక్రయాలు జరుగుతున్నాయని వివరించారు.    

13 ఏళ్లుగా నిర్వహిస్తున్న 

గల్ఫ్‌లో నిర్వహించే వాహనాల సంతను చూసి కామారెడ్డిలో 13 ఏళ్ల క్రితం వాహనా ల అంగడిని ఏర్పా టుచేసిన. చాలా గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చి వాహనాలను అమ్ముతున్నారు. కొనుగోలు దారులకు నచ్చిన ధరల్లో వాహనాలు దొరుకుతుండటం తోప్రతివారం వెయ్యి వాహనాల వరకు విక్రయాలు జరుగు తున్నాయి. కామారెడ్డితోపాటు నిజామాబాద్, ఆర్మూర్, సిరిసిల్ల, హైదారాబాద్ నుంచీ వచ్చి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. 

అరీఫ్‌బాబా, వాహనాల సంత నిర్వాహకుడు, కామారెడ్డి

తక్కువ ధరలో వాహనాలు లభ్యం 

వాహనాల అంగడిలో తక్కువ ధరలో బండ్లు దొరుకుతున్నాయి. అమ్మేవాళ్లు, కొనేవాళ్లు నేరుగా ఉండటం వల్ల ఇద్దరి అభిప్రాయాల మేరకు ధర కుదురుతుంది. వెంటనే డబ్బులు చెల్లించడంతోపాటు వాహనాన్ని స్వంతం చేసుకోవడం, వాహనానికి సంబంధించిన కాగితాలు కూడా కొనుగోలుదారు అందుబాటులో ఉంటాయి. ఇది ఒక మంచి నిర్ణయం. కన్సల్టెన్సీలో అయితే వాహనం సరైనది దోరకదు. తక్కువ ధరలో మంచి వాహనాలు లభ్యం అవుతున్నాయి. 

నర్సింలు, కామారెడ్డి