- క్లాసెన్‌కు 23 కోట్లు.. కోహ్లీకి 21 కోట్లు
- స్టార్లను వదులుకున్న ప్రాంచైజీలు
- త్వరలో ఐపీఎల్ మెగా వేలం
ముంబై: ఐపీఎల్‌లో ఏ ప్రాంచైజీ ఏ ఆటగాడిని అట్టిపెట్టుకోనుందనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఎన్నో రోజులుగా ప్రచారంలో ఉన్న ఊహాగానాలకు ప్రాంచైజీలు పుల్ స్టాప్ పెట్టాయి. అత్యధికంగా క్లాసెన్ కోసం సన్ రైజర్స్ రూ. 23 కోట్లు వెచ్చించగా.. ఎంతో అనుభవం కలిగిన ధోనీని చెన్నై సూపర్‌కింగ్స్ రూ. 4 కోట్లకే దక్కించుకోవడం గమనార్హం.
ఇక పరుగుల మెషిన్ విరాట్ కోహ్లీని ఆర్సీబీ రూ. 21 కోట్లతో అట్టిపెట్టుకుంది. రాజస్థాన్, కోల్‌కతా జట్లు ఆరుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోగా.. అందరికంటే కనిష్టంగా పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరితోనే సరిపెట్టుకుంది.
పంత్, రాహుల్‌కు టాటా..
గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను పక్కనబెట్టడం ఆశ్చర్యం కలిగించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను వదిలేశాయి. వీరితో పాటు హార్డ్ హిట్టర్‌గా పేరున్న మ్యాక్స్‌వెల్, గతేడాది మినీ వేలంలో అత్యధిక ధర పలికిన స్టార్క్ సహా గ్రీన్, సిరాజ్, షమీ సహా చాలా మందిని ప్రాంచైజీలు వదులుకున్నాయి. కాగా ఐపీఎల్ మెగా వేలం తేదీని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఈ నెల రెండో వారంలో లేదా మూడో వారంలో మెగావేలం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.