calender_icon.png 11 October, 2024 | 3:59 AM

రూ.30 లక్షల కోట్ల టాటా గ్రూప్ వారసులెవరు!?

11-10-2024 01:49:21 AM

ముంబై, అక్టోబర్ 10: దిగ్గజ పారి శ్రామికవేత్త, దేశంలో అతిపెద్ద వాణిజ్య గ్రూప్ అధిపతి రతన్ టాటా కన్నుమూసిన నేపథ్యం లో టాటా గ్రూప్‌ను నడిపించే వారసులె వరన్న చర్చలు జోరందుకున్నా యి. రూ.30 లక్షల కోట్ల మార్కెట్ విలువతో దేశంలోనే పెద్ద గ్రూప్ ఇది.

ఈ గ్రూప్ కంపెనీలన్నింటికీ మాతృసంస్థ టాటా సన్స్. ఈ టాటా సన్స్ వాటాల్లో అధికభాగం ఆ గ్రూప్ నిర్వహించే ట్రస్టుల చేతుల్లో ఉంటుంది. రతన్ టాటా మరణించేవరకూ టాటా సన్స్ గౌరవ చైర్మన్‌గా కొనసాగుతూ, టాటా ట్రస్ట్‌లకు  నే తృత్వం వహిస్తూ టాటా గ్రూప్‌ను పరోక్షంగా కంట్రోల్ చేస్తున్నారు.

అయితే రతన్‌టాటాకు పిల్లలు లేనందున, టాటా ట్రస్ట్‌ల స్టీరింగ్ తీసుకునేవారే తదుపరి టాటా గ్రూప్‌ను నడిపిస్తారు. ఈ వారసత్వాన్ని అందిపుచ్చుకు నే అవకాశం ఉన్నవారి పేర్లు వ్యాపార వర్గా ల్లో వినిపిస్తూ ఉన్నాయి. 

చంద్రశేఖరన్

టాటా సన్స్ చైర్మన్‌గా ప్రస్తు తం ఎన్ చంద్రశేఖరన్ ఉన్నారు. 2017లో టాటా సన్స్ పగ్గాల్ని రతన్ టాటా అప్పగించకముందు చంద్ర శేఖరన్ టీసీఎస్ సీఈవోగా బాధ్యతలు నిర్వహించేవారు. చంద్ర శేఖరన్ ఇకముందు కూడా టాటా గ్రూప్‌లో బలమైన శక్తిగా ఉంటారని పలువురు అంచనా వేస్తున్నారు. 

మాయా టాటా

నోయల్ రెండో కుమార్తె మా యా టాటా గ్రూప్ కంపెనీ టాటా క్యాపిటల్‌లో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. టాటా గ్రూప్‌లో క్రమేపీ ర్యాంక్‌ల్ని పెంచుకుంటున్నారు. భవిష్యత్తులో గణనీయమైన పాత్ర పోషించే అవకాశాలున్నాయి. 

నోయల్ టాటా

టాటా గ్రూప్ కంపెనీలు ట్రెంట్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లకు ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న నోయిల్ టాటా రతన్‌టాటాకు సవతి సోదరుడు. ఇద్దరూ ఒక తండ్రి (నావెల్ టాటా) బిడ్డలే కానీ తల్లులు వేరు. రతన్ స్థానంలో గ్రూప్ ఆధిపత్యాన్ని నోయల్ చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నోయల్ టాటా సన్స్‌లో వ్యక్తిగతంలో అత్యధిక వాటా (18 శాతం) కలిగిన పల్లోంజి మిస్త్రీకి అల్లుడు కూడా. పల్లోంజి మిస్త్రీ కుమారుడు సైరస్ మిస్త్రీ రతన్ టాటా వారసుడిగా 2011లో ఎంపికైనప్పటికీ, తదుపరి తలెత్తిన వివాదంలో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి 2016లో సైరస్‌ను తొలగించారు.

రెండేండ్ల క్రితం సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించారు. వివిధ వ్యాపార సంస్థల నిర్వహణలో నోయల్ నైపుణ్యం, అనుభవం కారణంగా రతన టాటాకు వారసుడిగా అవతరించే అవకాశాలున్నాయి. 

లేహ్ టాటా

నోయల్ టాటా పిల్లలైన లేహ్, మా యా, నెవిల్లే టాటాలు టాటా కుటుంబంలో తదుపరి తరం వారసులుగా చెలామణీ అవుతున్నారు. ముగ్గురిలో పెద్దదైన లే హ్ టాటా 2006 నుంచి టాటా గ్రూప్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం టాటా గ్రూప్ తాజ్ బ్రాండ్ హోటల్స్‌ను నిర్వ హిస్తున్న ఇండి యన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ వైస్ చైర్మన్‌గా లేహ్ ఉన్నారు. 

నెవిల్లే టాటా

నోయల్ ముగ్గురు సంతానంలో చిన్నవాడైన నెవిల్లే టాటా తన తండ్రికి సాయంగా రిటైల్ కంపెనీ ట్రెంట్‌లో కెరీర్‌ను ప్రారంభించారు. టాటా గ్రూప్ రిటైల్ వ్యాపారంపై నెవిల్లేకు మంచి పట్టు ఉన్నది. టాటా సన్స్ పగ్గాల్ని జేఆర్‌డీ టాటా నుంచి 1991లో రతన్ టాటా పొంది జేఆర్‌డీ హయాంలోనే చైర్మన్ అయ్యారు.