calender_icon.png 11 January, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైట్‌కాలర్ హైరింగ్ 9 శాతం వృద్ధి

03-01-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, జనవరి 2: అధిక నైపుణ్యం, వ్యూహాత్మక విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో డిసెంబర్ నెలలో వైట్‌కాలర్ హైరింగ్ 9 శాతం వృద్ధిచెందినట్లు నౌకరి జాబ్ స్పీక్ వెల్లడిచింది. వైట్‌కాలర్ జాబ్ ఇండెక్స్ 2023 డిసెంబర్‌తో పోలిస్తే 2024 డిసెంబర్‌లో 9 శాతం పెరిగి 2,651 పాయింట్లకు చేరిందని తెలిపింది. ముగిసిన నెలలో ఏఐ/ఎంఎల్ విభాగంలో హైరింగ్ 36 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్‌లో 13 శాతం, ఎఫ్‌ఎంసీజీలో 12 శాతం, హెల్త్‌కేర్‌లో 12 శాతం పెరిగాయన్నది.

2024 సంవత్సరంలో మందకొడిగా ఉన్న ఫ్రెషర్స్ హైరింగ్ డిసెంబర్ నెలలో మాత్రం 6 శాతం పెరిగిందని, లైఫ్‌స్టుల్, రిటైల్ రంగాల్లో ఫ్రెషర్స్ నియామకాలు జోరందుకున్నాయని నౌకరి రిపోర్ట్ తెలిపింది. ఈ రంగాల్లోని డిజైన్ విభాగంలో ఫ్రెషర్స్ నియామకాలు 39 శాతం పెరగ్గా, బ్యూటీ, వెల్‌నెస్‌లో 26 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్‌లో 19 శాతం వృద్ధిచెందినట్లు తెలిపింది.

ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఫ్రెషర్స్ హైరింగ్ డిసెంబర్‌లో 18 శాతం పెరిగిందని పేర్కొంది. క్రియేటివ్ విభాగంలో వీడియో ఎడిటర్లు, ఇంటీరియర్ డిజైనర్ల నియామకాలు జోరుగా సాగాయని, ఇంటీరియర్ డిజైన్ పరిశ్రమలో ఫ్రెషర్స్ హైరింగ్ 39 శాతం పెరిగాయని పేర్కొంది. 

హైదరాబాద్‌లో ఫ్రెషర్స్ హైరింగ్ 15 శాతం వృద్ధి

అధిక నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలకు నెలవైన హైదరాబాద్‌లో డిసెంబర్ నెలలో ఫ్రెషర్స్ హైరింగ్ 15 శాతం వృద్ధిచెందినట్లు నౌకరి జాబ్ స్పీక్ రిపోర్ట్ తెలిపింది. ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్, రియల్ ఎస్టేట్ విభాగాల్లో ఫ్రెషర్స్ నియామకాలు పెరిగాయన్నది.