calender_icon.png 20 January, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తులో చిత్తు చేస్తున్న గమ్మత్తు.. విస్కీ ఐస్ క్రీమ్

06-09-2024 12:45:13 PM

హైదరాబాద్: ఏవరైనా  ఇదేం  వ్యాపారం రా బాబూ... అని ప్రశ్నిస్తే .. అవును  నీకు తెలీదు.. వ్యాపారం  అంటే ఇలాగే ఉంటుంది.. అని ఎవరికి వారు సరి పెట్టుకోవాల్సిన రోజులొచ్చే శాయి.. తాజాగా ఒక ఐస్ క్రీమ్ షాపు వాళ్లు.. ప్రపంచంలో ఉన్న అన్నీ  ఫ్లెవర్ల ను తమ కస్టమర్ల కు రుచి చూపించి నట్లు న్నారు.ఇంకా ఏదైనా కొత్త ఫ్లేవర్ కావాలంటే పాపం ఆ అతి తెలివి మాస్టర్  చెఫ్ గారు.. ఏకంగా  మూడు పెగ్గుల విస్కీ కలిపేసి సరికొత్త రుచిని రంగరించి వినియోగ దారుల దుంప తెంచాలని నిర్ణయించు కొన్నట్లు  ఉంది.. అంతే మీ ముక్కుల నిండా విస్కీ వాసన.. నాలిక మొత్తం విస్కీ రుచులతో నింపేసి.. మెదడుకు ఏంచక్కా కిక్కు ఎక్కించి తరువత్తరువాత మీ నోటి నుంచి కెవ్వు కేక పుట్టించాలని చూస్తున్నారే మో.. తాజాగా హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రమ్ దందా చేస్తున్న జూబ్లీ హిల్స్ లోని వన్ అండ్ ఫైవ్ ఐస్ క్రీమ్ పార్లర్ పై జరిపిన దాడిలో ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 60 గ్రాముల ఐస్ క్రీమ్ లో 100 ఎంఎల్ విస్కీ కలిపి విక్రయిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు.

కాగా ఈ ఐస్ క్రీమ్ లను పిల్లలు, యువత భారీ మొత్తం లో కొనుగోలు చేస్తున్నట్లు అబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు.  ఈ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరికి నగరంలో ఇంకా ఎన్ని బ్రాంచులున్నాయి. ఇప్పటివరకు ఎన్ని పార్లర్లు ఉన్నాయి అని విచారిస్తున్నారు. కాగా ఇలాంటి విస్కీ కలిపిన ఐస్..క్రీమ్ ను తిన్న చిన్నారుల మెదడు లోని బ్లడ్ బ్రెయిన్ బారియర్(బీబీబీ) ను చేదించుకుని వెళ్లి మెదడులోని న్యూరో ట్రాన్స్ మీటర్ల ను ఉత్తేజ పరుస్తాయని దీన్ని హై..గా సైకలాజికల్ ఫీలింగ్ పొందుతారని ఇది తాత్కాలిక మేనని  మత్తు సంబంధిత పునరావాస చికిత్స అందించే వైద్యుడు రాజశేఖర్ తెలిపారు. పదే పదే.. ఇలాంటి ఉతార్ ఫీలింగ్ కోసమే బహుశా ఈ ఐస్ క్రీమ్ పార్లర్ కు వినియోగుదారులు వస్తున్నట్లుగా ఉందని ఆయన తెలిపారు. ఇది ప్రమాదకరమైన వ్యాపార ధోరిణి అని ఆయన తెలిపారు.