20-02-2025 01:03:00 AM
తిమ్మాపూర్, ఫిబ్రవరి 19: రోడ్డు ట్యాక్స్ చెల్లించకుండా అధికారుల కన్ను కప్పి అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాన్స్పోర్ట్ వాహ నాలపై హైదరాబాడ్ నుంచి వచ్చిన విజిలెన్స్ టీం, రవాణా శాఖ అధికారులు కొర డా జులిపిస్తున్నారు. ఈ దాడుల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేసిన తనిఖీల్లో 25 వాహనాలను సీజ్ చేసినట్లు సంబంధిత అధికారులు బుధవారం తెలిపారు.
ఈ సందర్భంగా గత ఏడాదిగా రోడ్డు టాక్స్ చెల్లించకుండా యతెచ్చగా అక్రమంగా రవా ణా చేస్తూ రవాణా శాఖ అధికారుల కన్ను కప్పి తిరుగుతున్న వాహనాలపై రాష్ర్ట ప్రభు త్వం కొరడా జులిపించాలని ఆదేశం జారీ చేసింది.
ఈ నే పద్యంలో సుంకం చెల్లించకుండా రెడీమేడ్ దుస్తులు, ఎలక్ట్రిక్ వస్తు వులు, లతోపాటు ఇతర సామాగ్రిలను అక్రమంగా తరలించే వాహనాలను తనిఖీ చేసి త్రైమాసిక పన్నుతోపాటు వాహన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి సీజ్ చేశామని తెలిపారు. పన్ను చెల్లించకుంటే 200% టాక్స్ అధికంగా విధిస్తామని పేర్కొన్నారు.
అనంతరం విజిలెన్స్ రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ రవాణా శాఖకు చెల్లిం చాల్సిన ట్యాక్స్‌ను వెంటనే చెల్లించాలని లేనిచో వారిపై తనిఖీలను ముమ్మరంగా చేపట్టి చర్యలు తీసుకొని వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలో డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి ఎంవిఏ రవికుమార్, లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.