calender_icon.png 21 February, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఎండీఏ అధికారుల కొరడా

18-02-2025 12:00:00 AM

సర్వే నం 159లో  వెలిసిన అక్రమ గుడిసెల కూల్చివేత

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17: మియాపూర్ బొల్లారం రోడ్డులో హెచ్‌ఎండీఎ అధికారులు కొరడా ఝుళిపించారు. సర్వే నం 159 హెచ్‌ఎండీఎ ఆధీనంలో ఉన్న 445 గజాల స్థలంలో అక్రమంగా వెలిసిన సుమారు 10 గుడిసెలను జేసీబీ సాయంతో నేల మట్టం చేశారు. మియాపూర్ బొల్లారం రోడ్డు బస్ బాడీ ఎదురుగా సర్వే నం 159 లో హెచ్‌ఎండీఎ ఆధీనంలో 445 గజాల స్థలం ఉన్నది.

అయితే సదరు స్థలాన్ని ఖాళీ చేయా లని గుడిసె వాసులకు 2 నెలల కిందట నోటీసులు జారీ చేశారు. అయితే ఆ స్థలాన్ని ఎంతకి ఖాళీచేయక పోవడంతో సోమవారం హెచ్‌ఎండీఎ ఎంఆర్‌ఓ దివ్యారెడ్డి సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకొని మియాపూర్ పోలీసుల బందోబస్తు మధ్య గుడిసెలను తొలగించారు. ఈ కార్య క్రమంలో యస్‌ఐ సంతోష్ రెడ్డి, అధికా రులు బాబా హుడా పోలీసులు, మియాపూర్ యస్ ఐ మాణిక్యం, పోలీసులు పాల్గొన్నారు.