- నగరవ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
- ఈ యేడాదిలో 52,980 మందిపై కేసులు
- గతంతో పోలిస్తే పెరిగిన శిక్షలు, జరిమానాలు
- బేగంపేట, గోషామహాల్, మాదాపూర్‌లో ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): మందుబాబులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
నగరంలో రోజురోజుకు పెరుగుతున్న పాశ్యాత కల్చర్‌తో పబ్బులు, పార్టీలు, వేడుకల పేరిట ఫుల్‌గా మద్యం తాగిన కొందరు ఆకతాయిలు రోడ్లపై వాహనాలు నడుపుతూ నానా హంగా మా సృష్టిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నగరవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మద్యం తాగి వాహనాలు నడప డం మూలంగానే జరుగతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
ఈ క్రమంలో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారి ని కట్టడి చేయడంతో పాటు ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2022లో 44,558 మంది, 2023లో 43, 940 మంది, ఈ యేడాదిలో ఇప్పటివరకు (నవంబర్ ౨౫) మొత్తం 52,980 మంది పట్టుబడ్డారని నగర ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వీటికి ఆదనం.
తనిఖీల్లో పట్టుబడితే జైలుకే..
ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో మద్యం సేవించి వాహ నం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే అతనిపై కేసు నమోదు చేసి వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు జరిమానా విధిస్తున్నారు. రెండో సారి పట్టుబడితే జరిమానాతో పాటు వారం రోజు ల జైలుశిక్ష, 3నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నారు.
మూడోసారి పట్టుబడితే కేసు తీవ్రతను బట్టి 6 నెలల నుంచి జీవితకాలం పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఒకనెల నుంచి ఆరునెలల వరకు జైలుశిక్ష విధిస్తున్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించడానికి బేగంపేట, గోషామహాల్, మాదాపూర్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
హిట్ అండ్ రన్ కేసుల్లో పదేళ్ల జైలు..
ఈ మధ్యకాలంలో జరిగిన చాలావర కు ప్రమాదాలు.. డ్రైవర్లు మద్యం సేవించి వాహ నం నడపడమే ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. గతంలో (2024 జూన్ వరకు) మద్యం మత్తులో ప్రమాదాలు చేసి ఎవరి మృతికైనా కారణమైతే 304 పార్ట్ 2 ఐపీసీ కింద కేసులు నమో దు చేసేవారు.
ఆయా కేసుల్లో వాహనదారులకు న్యాయస్థానం గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించేది. అయితే జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద కేసులు నమోదు చేస్తున్నారు. దీని ప్రకారం గరిష్ఠంగా పదే ళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వాహనదారులకు అవగాహన కల్పిస్తాం
హైదరాబాద్ కమిషనరేట్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశాం. ముఖ్యంగా జూబ్లీహి ల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆయా ఏరియాల్లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్ అధికంగా నివాసం ఉండటం, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్‌లు ఎక్కువగా ఉండటం వలన అర్ధరాత్రుళ్ల వరకు మద్యం సేవించిన ఆకతాయిలు వాహనాలు నడుపుతూ హం గామా సృష్టిస్తున్నారు.
గతం తో పోల్చితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య తగ్గినా.. మరింతగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రమాదాల నివారణే మా ప్రథమ కర్తవ్యం. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే పర్యవసానాలపై వాహనదారులకు అవగాహ న కార్యక్రమాలు నిర్వహిస్తాం.
రాహుల్ హెగ్డే,
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ