- * చీరతో ఉరేసుకున్న వివాహిత
* మెదక్ జిల్లాలో ఘటన
మెదక్, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): వీడియో కాల్ మాట్లాడు తూ.. మహిళ సూసైడ్ చేసుకున్న సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. టేక్మాల్ మండలం కోరంపల్లికి చెందిన ప్రభాకర్‌కు పాపన్నపేట మండలం గాంధారిపల్లి గ్రామానికి చెందిన లావణ్య(38)తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా లావణ్య మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుంది. అయితే లావణ్య ఓ వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరుడు కాశీనాథం గురువారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టేక్మాల్ ఎస్సై రాజేశ్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, చివరగా ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపారు.