calender_icon.png 14 February, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొబ్బరి బొండాలు కొనడానికి వెళ్తే కారులో రూ. రెండు లక్షల మాయం

14-02-2025 01:05:15 AM

కామారెడ్డి జిల్లా బాన్స్వాడ లో ఘటన

బాన్సువాడ ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి) కొబ్బరి బొండాలు కొనడానికి వెళ్లిన ఓ వ్యక్తి తన కారులో ఉన్న రెండు లక్షల మాయమైన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా.. బాన్సువాడ డివిజన్ పరిధిలోని. ఇబ్రహీంపేటకు చెందిన చందర్ ఈ నెల 10 న బ్యాంకు నుండి రూ 2 లక్షలు డ్రా చేసి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొబ్బరి బొండాలు కొనడానికి కారు ఆపాడు. రెండు లక్షల నగదు డబ్బులు కారులో నే ఉంచాడు.

కొబ్బరి బొండాలు కొని కారు వద్దకు వెళ్లేసరికి కారులో చూడగా డబ్బు కనపడలేదు. దీంతో బాధితుడు చందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు మంగళవారం బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొబ్బరి బొండాల దుకాణం వద్ద ఉన్న సీసీ కెమెరాలో గుర్తు తెలియని దుండగులు వచ్చి కారులో ఉన్న డబ్బు మాయం చేసినట్టు కనపడిం దని పోలీసులు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.